గత మూడేళ్ళుగా సక్సెస్ కోసం సతమతమవుతున్న బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇప్పుడు రెట్రో సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది. రేపు మే 1 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెట్రో చిత్రం పై భారీ అంచనాలున్నాయి. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజ హెగ్డే నిజంగా బుట్టబొమ్మ్మలా కనిపించబోతుంది.
అంతేకాదు రెట్రో ప్రమోషన్స్ లోను పూజ హెగ్డే వింటేజ్ లుక్ అందరిని తెగ ఇంప్రెస్ చేసింది. రెట్రో చిత్రం కోసం తనవంతు ఎఫర్ట్ పెట్టి పని చేసిన పూజ హెగ్డే కి రెట్రో హిట్ అనివార్యంగా మారింది. కొన్నాళ్లుగా వరస ప్లాప్ లను చూసిన పూజ హెగ్డే కి రెట్రో హిట్ అయితే ఆమె కెరీర్ మళ్ళి ఊపందుకుంటుంది.
మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రెట్రో సక్సెస్ కోసం బుట్టబొమ్మ చాలా వెయిట్ చేస్తుంది. అటు సూర్య కూడా థియేట్రికల్ హిట్ చూసి కొన్నేళ్లు కావడంతో ఆయనకు కూడా రెట్రో సక్సెస్ ఇంపార్టెంట్. మరి రెట్రో రిజల్ట్ కోసం మరికొన్ని గంటలు వెయిట్ చేస్తే సరి.