Advertisementt

పవన్ కొడుక్కి సైక్రియాట్రిస్ట్ ట్రీట్మెంట్

Wed 30th Apr 2025 02:39 PM
pawan  పవన్ కొడుక్కి సైక్రియాట్రిస్ట్ ట్రీట్మెంట్
Pawan Kalyan Son Mark Shankar Undergoing Treatment పవన్ కొడుక్కి సైక్రియాట్రిస్ట్ ట్రీట్మెంట్
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ రీసెంట్ గానే సింగపూర్ లోని ఓ స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి బయటపడిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లి కొడుకుని కోలుకోగానే హైదరాబాద్ తీసుకొచ్చేసారు. మార్క్ శంకర్ ఊపిరితిత్తులలోకి పొగ చేరడంతో రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు మార్క్ శంకర్ ని డిశ్చార్జ్ చేసి పంపించేశారు. పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా కొడుకుని తీసుకుని హైదరాబాద్ రాగానే, అన్నా లెజెనోవా కొడుకు క్షేమం కోసం తిరుమల వెళ్లి శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించారు. 

తాజాగా పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ హెల్త్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇటీవల నా కొడుకు సింగపూర్ లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. ఆ ప్రమాదంలో ఒక బాలుడు చనిపోగా, ఒక బాబు కి కాళ్ల, చేతులు కాలిపోయాయి. నా కొడుకు ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లింది. 

ఆ అగ్నిప్రమాదం నుంచి నా కుమారుడు ఇంకా పూర్తిగా తేరుకోలేకపోతున్నాడు. అర్ధరాత్రి పూట ఉలిక్కి పడుతున్నాడు. ఆ మేడ మీద నుండి పడిపోతున్నట్టు పీడకలలు వస్తున్నాయి. ఈ ట్రామా, భయాన్ని తగ్గించేందుకు నాకొడుక్కి సైకియాట్రిస్ట్ ట్రీట్ మెంట్ అందిస్తున్నామంటూ పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ హెల్త్ పై స్పందించారు. 

Pawan Kalyan Son Mark Shankar Undergoing Treatment:

Mark Shankar Pawanovich health update

Tags:   PAWAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ