ఇపుడు అల్లు అర్జున్ నేషనల్ కాదు ఇంటెర్నేషన్ అన్నట్టుగా ఆయన AA 22 ని అనౌన్స్ చేసారు. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో కలిసి అల్లు అర్జున్ తదుపరి మూవీని అనౌన్స్ చేసిన తీరుకు ఆయన అభిమానులే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ అంతా సర్ ప్రైజ్ అయ్యారు. అనౌన్సమెంట్ వీడియో తోనే AA 22 ప్రాజెక్ట్ విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసారు మేకర్స్.
అయితే అల్లు అర్జున్-అట్లీ కాంబో మూవీ చెన్నై కానీ, లేదంటే ముంబైలో కానీ గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో మొదలవుతుంది అనుకుంటే.. అల్లు అర్జున్ కామ్ గా హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి అక్కడే అట్లీ తో కలిసి AA 22 ని సింపుల్ గా సైలెంట్ గా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేసిన విషయం తెలిసి అల్లు అభిమానులు అవాక్కవుతున్నారు.
అనౌన్సమెంట్ వీడియోనే అంత గ్రాండ్ గా ఇచ్చినోళ్ళు ఓపెనింగ్ విషయంలో అంగరంగ వైభవంగా చేస్తారనుకుంటే ఇంత ట్విస్ట్ ఇచ్చారేమిటో అంటూ మాట్లాడుకుంటున్నారు సదరు మూవీ లవర్స్. ఇక అల్లు అర్జున్-అట్లీ AA 22 షూటింగ్ ఎక్కువగా ముంబై, అలాగే విదేశాల్లో ఉండబోతుంది అని, ఇకపై అల్లు అర్జున్ హైదరాబాద్ లో కనిపించేది తక్కువే, ఎక్కువగా ఆయన ముంబైలోనే ఉంటారని తెలుస్తుంది.
అల్లు అర్జున్ నేషనల్ లెవల్ నుంచి ఇంటర్నేషనల్ లెవల్ కి వెళ్లిపోయారని ఇది చూస్తే తెలుస్తుంది. ఇకపై అల్లు అర్జున్ ముంబై లోనే ఇల్లు కొనేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు, ఇకపై ఆయన బాలీవుడ్ దర్శకులతోను కమిట్ అయ్యే ఛాన్స్ వుంది అనే ప్రచారం జోరుగా మొదలైంది.