చాలామంది తారలు పెదాలు బాలేదనో, ముక్కు బాలేదనో, చెవి బాలేదనో, ఇంకా శరీరంలో ఏయే భాగాలూ నచ్చకపోయినా వాటికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని అందాలను మెరుగుపరుచుకుంటారు. అది ఇప్పుడు లేటెస్ట్ గా నడుస్తున్న ట్రెండ్ కాదు.. అతిలోక సుందరి శ్రీదేవి దగ్గర నుంచి వస్తున్న విచిత్రమే.
అయితే సినిమా తారలైనా మరెవ్వరైనా కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటే తప్పేమిటి అంటుంది రకుల్ ప్రీత్. రకుల్ ప్రీత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. గతంలో చాలా వ్యాధులకు అసలు ట్రీట్మెంట్ దొరికేది కాదు. కానీ ఇప్పుడు ప్రతి జబ్బుకి ట్రీట్మెంట్ దొరుకుతోంది. అలాంటప్పుడు ఎవరైనా అందంగా కనిపించేందుకు కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటే అందులో తప్పేముంది.
కానీ నాకు ఎప్పుడు కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం రాలేదు, ఎందుకంటే దేవుడు తనకు మంచి రూపాన్ని ఇచ్చాడంటూ చెప్పుకొచ్చిన రకుల్ ప్రీత్ తనకు కొన్ని నెలల క్రితం జిమ్ లో తగిలిన గాయం ఇంకా తగ్గలేదు, ఆ గాయం వలన ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను అంటూ రకుల్ చెప్పుకొచ్చింది.