Advertisementt

మెల్లగా మహాభారతాన్ని సెట్ చేస్తోన్న జక్కన్న

Mon 28th Apr 2025 01:39 PM
mahabharata  మెల్లగా మహాభారతాన్ని సెట్ చేస్తోన్న జక్కన్న
Rajamouli Confirms Nani Will Be Part Of Mahabharata మెల్లగా మహాభారతాన్ని సెట్ చేస్తోన్న జక్కన్న
Advertisement
Ads by CJ

జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం పై ఎలాంటి చిన్న అప్ డేట్ వచ్చినా అది ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవడం చూస్తుంటాం. రాజమౌళి ఎప్పటికప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి మట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడో తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అని ప్రకటించిన రాజమౌళి ఈమద్యలో తాను పూర్తి చెయ్యాల్సిన కమిట్మెంట్స్ ఉన్నాయని, మహాభారత ని రెండు మూడు భాగాలుగా కాకుండా నాలుగైదు భాగాలుగా తెరకెక్కిస్తాన్ని చెప్పారు. 

గతంలో మహాభారతంలో జూనియర్ ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రోల్ ప్లే చేస్తే బావుంటుంది, ఆ రోల్ కోసం ఎన్టీఆర్ నే ఎంచుకుంటాను, ఎన్టీఆర్‌ని శ్రీకృష్ణుడిగా చూపించుకోవడం చాలా రోజులుగా నా కల అని చెప్పారు, అంతేకాకుండా కర్ణుడి పాత్ర కోసం ప్రభాస్ ని చూజ్ చేసుకుంటాను అన్న రాజమౌళి తాజాగా మహాభారతంపై మరో లీక్ వదిలారు. 

మహాభారతం తెరకెక్కిస్తే హీరో నాని ఖచ్చితంగా భాగమవుతాడని రాజమౌళి స్పష్టం చేశారు. మరి రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టకపోయినా.. ఆ ప్రోజెక్టు విషయంలో ఒక్కొక్కటి ఇలా సెట్ చేసున్నారని ఆయన ఫ్యాన్స్ తో పాటుగా రాజమౌళి చెప్పిన స్టార్ హీరోల ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీలవుతున్నారు. 

Rajamouli Confirms Nani Will Be Part Of Mahabharata:

SS Rajamouli said it is his dream to make a feature on Mahabharata

Tags:   MAHABHARATA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ