Advertisementt

KGF ఎఫెక్ట్-రామాయణంలో సీతను మార్చేసింది

Fri 25th Apr 2025 11:13 AM
srinidhi shetty  KGF ఎఫెక్ట్-రామాయణంలో సీతను మార్చేసింది
Srinidhi Shetty On Losing Sita Role In Ramayana KGF ఎఫెక్ట్-రామాయణంలో సీతను మార్చేసింది
Advertisement
Ads by CJ

కన్నడ భామ శ్రీనిధి శెట్టి కెజిఎఫ్ ఫ్రాంచైజీ తర్వాత కోలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ తమిళనాట అమ్మడుకు వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు హిట్ 3 చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి ఆ సినిమా ప్రమోషన్స్ లో నాని తో పటిపడుతుంది. అదలా ఉంటే హిట్ 3 ప్రమోషన్స్ లో శ్రీనిధి శెట్టి చెప్పిన కొన్ని విషయాలు ఆమె ఫ్యాన్స్ కు షాకిచ్చాయి. 

బాలీవుడ్ లో నితీష్ తివారి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రాన్ని శ్రీనిధి వదులుకుందట. ఆ చిత్ర ఆడిషన్స్ కి సీత పాత్ర కోసం వెళ్ళినట్లుగా చెప్పిన ఆమె ఆ చిత్రం ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో చెప్పి షాకిచ్చింది. రామాయణలో యష్ రావణుడిగా కనిపిస్తున్నారు, కెజిఎఫ్ లో రొమాన్స్ చేసి ఇక్కడ ఆయన రావణ్ పాత్రలో నేను సీత పాత్రలో కనిపిస్తే ప్రేక్షకులకు నచ్చదేమో అనే ఫీలింగ్ కలిగిందని అందుకే ఆ పాత్రను వదులుకున్నట్టుగా చెప్పింది. 

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణ లో రాముడి కేరెక్టర్ లో రణబీర్ సరసన సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది. శ్రీనిధి వద్దనుకున్న పాత్రను సాయి పల్లవి ఎగరేసుకుపోయింది. మరి రామాయణతో సాయి పల్లవి బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. ఆ అవకాశాన్ని శ్రీనిధి వదులుకుంది. 

Srinidhi Shetty On Losing Sita Role In Ramayana:

Srinidhi Shetty reveals she was offered Sita role in Nitesh

Tags:   SRINIDHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ