అల్లు అర్జున్ పుష్ప ద రూల్ సక్సెస్ తర్వాత కోలీవడ్ డైరెక్టర్ అట్లీ తో తన తదుపరి సినిమాని ఏప్రిల్ 8 బర్త్ డే కి ఇంటర్నేషనల్ లెవల్లో అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్-అట్లీ కాంబో అనౌన్సమెంట్ వీడియో ఎంత సన్సేషనల్ అయ్యిందో చూసారు. అల్లు అర్జున్-అట్లీ మీటింగ్ దగ్గర నుంచి అమెరికాలో అల్లు అర్జున్ లుక్ టెస్ట్, అక్కడి టెక్నీషియన్స్ తో డిస్కర్స్ చెయ్యడం అన్ని చాలా హైలెట్ అయ్యాయి.
అల్లు అర్జున్-అట్లీ కాంబో అనౌన్సమెంట్ వీడియోతోనే అందరి చూపు తమ ప్రాజెక్ట్ పై ఉండేలా చూసుకున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం చెన్నై లో పూజా కార్యక్రమాలతో మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు జూన్ చివరి వారం నుంచి అల్లు అర్జున్, అట్లీ తో కలిసి సెట్స్ పైకి వెళతారని సమాచారం.
ప్రస్తుతం అల్లు అర్జున్ సోలో గా అట్లీ ని మీటయ్యి ఇంకా కొన్ని లుక్స్ ఫైనల్ చేసేందుకు దుబాయ్ వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తుంది. ముంబై, దుబాయ్, అమెరికా ఇలా అల్లు అర్జున్ ఈ రెండు నెలలు బిజీగా తిరుగుతారని, అట్లీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారని తెలుస్తుంది. సినిమా మొదలయ్యే సమయానికి హీరోయిన్ పై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అని టాక్.