Advertisementt

త్రోబ్యాక్: హీరోయిన్ కోసం హీరోల విరోధం?

Thu 24th Apr 2025 05:26 PM
star heroes  త్రోబ్యాక్: హీరోయిన్ కోసం హీరోల విరోధం?
Differences between Star Heroes for a heroine త్రోబ్యాక్: హీరోయిన్ కోసం హీరోల విరోధం?
Advertisement
Ads by CJ

పరిశ్ర‌మ‌లో ప్ర‌ముఖ సినీ కుటుంబం నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు ట్యాలెంటెడ్ హీరోలు నువ్వా నేనా? అంటూ పోటీప‌డుతూ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. నేడు వెయ్యి కోట్ల క్లబ్ ని అందుకుని దేశంలో పాపుల‌ర్ హీరోల జాబితాలో తాము కూడా చేరామ‌ని నిరూపించారు. అయితే ఆ ఇద్దరు హీరోల మ‌ధ్య వ్య‌క్తిగ‌త క్లాష్ గురించి బాలీవుడ్ మీడియాలో గుస‌గుస‌లు వైర‌ల్ అయ్యాయి.

 

ఆ ఇద్ద‌రు ప్ర‌ముఖ‌ హీరోలు ఒక యంగ్ హీరోయిన్ విష‌యంలో గొడ‌వ ప‌డ్డార‌ని, త‌న‌ను పెళ్లి చేసుకోవాల‌ని ఆరాట ప‌డ్డార‌ని, ఈ గొడ‌వల‌ కార‌ణంగా 18 సంవ‌త్స‌రాలుగా ఆ ఇద్ద‌రూ ఒక‌రితో ఒక‌రు మాట్లాడుకోలేద‌ని హిందీ మీడియాలో ప్ర‌చారం సాగింది. ఈ త్రోబ్యాక్ మ్యాట‌ర్ ఇటీవ‌ల‌ మ‌రోసారి వెబ్ లో వైర‌ల్ గా మారుతోంది.

 

టాలీవుడ్ ప్ర‌ముఖ హీరో త‌న డెబ్యూ సినిమాలో న‌టించిన ముంబై హీరోయిన్ తో ప్రేమ‌లో ప‌డ్డాడు. అయితే అదే హీరోయిన్ తో ఆ హీరో క‌జిన్ కూడా ల‌వ్ లో ప‌డ్డాడు. దీంతో ముగ్గురి మ‌ధ్యా ముక్కోణ ప్రేమ‌క‌థ గొడ‌వ‌ల‌కు దారి తీసింద‌ని క‌థ‌నాలొచ్చాయి. ఆ గొడ‌వ‌ల త‌ర్వాత ఆ ఇద్ద‌రు అగ్ర హీరోలు సంవత్స‌రాల పాటు మాట్లాడుకోలేద‌ని కూడా క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి. మొద‌టి సినిమా త‌ర్వాత ఆ హీరోయిన్ కూడా టాలీవుడ్ నుంచి మాయ‌మ‌వ్వ‌డంతో ఇదంతా నిజ‌మేన‌ని కూడా చాలా మంది న‌మ్మారు! ఇది చాలా ఏళ్ల నాటి సంగ‌తి. అయినా మ‌రోసారి హిందీ మీడియాలో ఈ త్రోబ్యాక్ మ్యాట‌ర్ వైర‌ల్ గా మారుతోంది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రు? ఆ ఇద్ద‌రు పాన్ ఇండియా స్టార్లు ఎవ‌రో గెస్ చేయ‌గ‌ల‌రా?

Differences between Star Heroes for a heroine:

  Star Heroes fight for a heroine  

Tags:   STAR HEROES
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ