Advertisementt

పూరి స్పీడు తగ్గలేదబ్బా..

Thu 24th Apr 2025 10:45 AM
puri  పూరి స్పీడు తగ్గలేదబ్బా..
Puri - Vijay Sethupathi combo update పూరి స్పీడు తగ్గలేదబ్బా..
Advertisement
Ads by CJ

దర్శకుడు పూరి జగన్నాథ్ స్టయిల్ అంటే ఆయన మేకింగ్ స్టయిల్ కి ఫిదా కానీ వారుండరు. పెద్ద పెద్ద దర్శకులే పూరి మేకింగ్ ని మెచ్చుకుంటారు. పూరి కథ ఎంత స్పీడుగా రాస్తారో, అంతే స్పీడు గా సినిమాని తెరకెక్కిస్తారు. నేను ప్లాప్ లో ఉన్నాను కదా అని ఆయన తన స్పీడు తగ్గించుకోరు, స్టయిల్ మార్చుకోరు, చెక్కిందే చెక్కరు.

లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి తో సినిమా చేయడానికి ఏ హీరో ముందుకు రారు అనుకున్నారు. కానీ కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి పూరి జగన్నాథ్ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యారు, పూరి-విజయ్ సేతుపతి కాంబో అనౌన్సమెంట్ వచ్చింది. విజయ్ సేతుపతిని డిజాస్టర్ దర్శకుడితో సినిమా ఎందుకు చేస్తున్నారు అని ఫ్యాన్స్ అడిగారు, పూరి గత చిత్రాల రిజల్ట్ తో పని లేదు, ఆయన చెప్పిన కథ నచ్చింది, ఓకె చేశాను అని సింపుల్ గా చెప్పేసారు. 

ఇక పూరి ఇప్ప‌టికే స్క్రిప్టు వ‌ర్క్ దాదాపుగా పూర్తి చేసేసారు, బెగ్గర్ టైటిల్ తో మొదలు కాబోయే ఈ చిత్రానికి సంబందించిన డైలాగ్ వెర్ష‌న్ తో స‌హా స్క్రిప్టు రెడీ అయినట్లుగా తెలుస్తుంది. జూన్ లో సెట్స్ మీదకి తీసుకెళ్లి కేవ‌లం 60 రోజుల్లో సినిమాని షెడ్యూల్స్ వేసుకొని ఫినిష్ చేయాల‌న్న‌ది పూరి ప్లాన్ అట. కారణం విజయ్ సేతుపతి అంతవరకే డేట్స్ ఇచ్చారట. 

మరి పూరి మేకింగ్ స్టయిల్ గురించి చెప్పక్కర్లేదు, ఆయన అంతే స్పీడుగా విజయ్ సేతుపతి బెగ్గర్ మూవీని కంప్లీట్ చేసేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తుంది. 

Puri - Vijay Sethupathi combo update:

Puri - Vijay Sethupathi combo shooting update 

Tags:   PURI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ