Advertisementt

ఎన్టీఆర్ పులితో ఫైట్-మహేష్ డైనోసార్ తో ఫైట్

Tue 22nd Apr 2025 10:13 PM
mahesh  ఎన్టీఆర్ పులితో ఫైట్-మహేష్ డైనోసార్ తో ఫైట్
Mahesh Babu fight with Dinosaurs ఎన్టీఆర్ పులితో ఫైట్-మహేష్ డైనోసార్ తో ఫైట్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ లో యుంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దర్శకుడు రాజమౌళి పులితో ఫైట్ చేయించారు. ఎన్టీఆర్ పులితో ఫైట్ చేసే సీన్ కి మాస్ ఆడియన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి, ఆ సీన్ గురించి అందులోని ఎన్టీఆర్ నటనకు గురించి ఇప్పటికి మాట్లాడుకుంటున్నారు. మరి అలాంటి రాజమౌళి తన తదుపరి హీరో మహేష్ తో అంతకుమించి ఫైట్ చేయిస్తారుగా. 

అదే జరుగబోతుంది. SSMB 29 లో మహేష్ తో రాజమౌళి ఓ నెక్స్ట్ లెవల్ ఎపిసోడ్ ని షూట్ చేయబోతున్నారట. అడవి నేపథ్యంలో ఓ పవర్ ఫుల్ ఎపిసోడ్ SSMB 29 కోసం రాజమౌళి డిజైన్ చేశారట. ఆ ఎపిసోడ్ మొత్తం ఓ డైనోసార్ చుట్టూ తిరుగుతుంది అని, హీరో వెంట డైనోసార్స్ ప‌డ‌డం, మహేష్ దానిని ఛేజ్ చేయ‌డం, మొత్తంగా హీరో త‌న‌ని తాను కాపాడుకోవ‌డం ఇలా ఆ ఎపిసోడ్ ని నెక్స్ట్ లెవల్ అనేలా డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. 

ప్రస్తుతం హైదరాబాద్ లోనే మూడో షెడ్యూల్ చిత్రీకరిస్తున్నారు రాజమౌళి. మహేష్, పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ల నడుమ కీలకసన్నివేశాల చిత్రీకరణలో రాజమౌళి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక అడివి నేపధ్యమున్న ఎపిసోడ్ కోసం రాజమౌళి ఆఫ్రికా అడవులకు వెళతారని తెలుస్తుంది. 

Mahesh Babu fight with Dinosaurs :

Mahesh Babu fight with Dinosaurs in SSMB29

Tags:   MAHESH
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ