నితీష్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సౌత్ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కన్నడ పాన్ ఇండియా స్టార్ యష్ రావణుడిగా కనిపించనున్నారు. కెజిఎఫ్ తో పా ఇండియా మార్కెట్ ను షేక్ చేసిన యష్ ప్రస్తుతం టాక్సిక్ చిత్రం చేస్తున్నారు.
దానితో పాటుగా హిందీ రామాయణ లో యష్ రావణుడిగా నెగెటివ్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ వారంలో ముంబైలో రామాయణం పార్ట్ 1 షూటింగ్‌లో యష్ పాల్గొనబోతున్నారు. ఇప్పటివరకు యష్ పై ఎలాంటి సన్నివేశాలు చిత్రీకరించలేదు, కేవలం రావణుడి పాత్ర కోసం ఫోటో షూట్ మాత్రమే చేసారు. యష్ ఎంటర్ అవగానే రావణుడి పాత్రపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు అని తెలుస్తోంది.
అటు టాక్సిక్, ఇటు రామాయణ చిత్రాలను యాష్ ఏకకాలంలో పూర్తి చేస్తారు అని సమాచారం. యష్ టాక్సిక్ వచ్చే ఏడాది మార్చ్ లో విడుదల కాబోతుంది. మరోపక్క రణబీర్ కపూర్ కూడా రామాయణ షూటింగ్ లో పాల్గొంటున్నారు.