Advertisementt

ఆసుపత్రి పాలైన యాంకర్ రష్మి

Sun 20th Apr 2025 07:14 PM
rashmi  ఆసుపత్రి పాలైన యాంకర్ రష్మి
Rashmi hospital picture worries her fans ఆసుపత్రి పాలైన యాంకర్ రష్మి
Advertisement
Ads by CJ

ఈటివి జబర్దస్త్ లో అనసూయ తో పోటీపడి మరీ గ్లామర్ షో చేసే యాంకర్ రష్మీ అవకాశం వచ్చినప్పుడల్లా వెండితెర పై అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది కానీ అనసూయ మాదిరి రష్మి సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ అవ్వలేదు అనే చెప్పాలి. కానీ ఈటీవిలో గత 12 ఏళ్లుగా జబర్దస్త్ కామెడీ షో దగ్గర నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ వరకు ఆమె యాంకరింగ్ చేస్తుంది. 

అంత యాక్టీవ్ గా ఉండే రష్మీ సడన్ గా ఆసుపత్రిలో దర్శనమిచ్చింది. అసలు రష్మీకి ఏమైంది, ఆమె ఇంత సడన్ గా ఆసుపత్రికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది రష్మీ నే బయటపెట్టింది. ఇంతటి క్లిష్ట స‌మ‌యంలో త‌న‌కు మ‌ద్ధ‌తుగా నిలిచిన డాక్టర్స్, ఫ్యామిలీ మెంబెర్స్, త్వరగా ఆకోలుకోవాలని కోరుకున్న అందరికి రష్మీ ధ‌న్య‌వాదాలు చెప్పింది. ఇక తానెందుకు ఆసుపత్రికి వెళ్లిందో కూడా రివీల్ చేసింది.. 

సుమారు 5 రోజుల్లోనే నా శ‌రీరంలో హిమోగ్లోబిన్ శాతం 9కి ప‌డిపోయింది. జ‌న‌వ‌రి నెల నుంచి నాకు ఏం జ‌రుగుతుందో కూడా అర్థం లేదు. తీవ్ర‌మైన భుజం నొప్పి, అధిక ర‌క్త‌స్రావంతో ఇబ్బందిప‌డ్డాను. డాక్టర్ దగ్గరికి వెళితే అసలు ముందు దేనికి ట్రీట్‌మెంట్ తీసుకోవాలో కూడా తెలియ‌లేదు. మార్చి నెల చివరికల్లా పూర్తిగా నీర‌సించిపోయా. 

ఫైనల్ గా వ‌ర్క్ ప‌ర‌మైన క‌మిట్‌మెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఆసుప‌త్రిలో చేరా. ఏప్రిల్ 18న ఆపరేషన్ జ‌రిగింది. ప్ర‌స్తుతం నేను ఆరోగ్యంగానే ఉన్నా. మ‌రో 3 వారాల‌పాటు విశ్రాంతి తీసుకోవాలి అంటూ రష్మీ తన ఇన్స్టా పోస్ట్ లో రాసుకొచ్చింది. 

Rashmi hospital picture worries her fans:

Anchor Rashmi in hospital

Tags:   RASHMI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ