హీరోయిన్ గానే కాకుండా అవకాశం వచ్చినప్పుడల్లా స్పెషల్ సాంగ్స్ లో కనిపించడం తమన్నా స్పెషల్, ఆ సాంగ్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో తమన్నా క్రేజ్ బాగా పెరిగింది. తెలుగులో ఎన్టీఆర్ జై లవ కుశ చిత్రంలో స్వింగ్ జర ఐటమ్ సాంగ్ లో అద్దరగొట్టిన తమన్నా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ లోను స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. అంతేకాదు బాలీవుడ్ లో స్త్రీ 2, రైడ్ చిత్రాల్లో తమన్నా స్పెషల్ సాంగ్స్ చేసింది. అన్ని సూపర్ హిట్సే .
తాజాగా తమన్నా నటించిన ఓదెల 2 పాన్ ఇండియా మార్కెట్ లో విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. తమన్నా ఓ ఇంటర్వ్యూలో స్పెషల్ సాంగ్స్ చేస్తే తప్పేముంది, నాకెలాంటి తప్పు అనిపించడం లేదు, అందరూ ఐటెమ్ సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ అనగానే అదొక టైప్ లో చూస్తారు. నేను ఇప్పుడే కొత్తగా ఏమీ స్పెషల్ సాంగ్స్ చేయడం లేదు.
ఐటమ్ సాంగ్స్ లో ఎప్పటి నుంచో ఆడుతున్నాను, స్పెషల్ సాంగ్ అనేది ఒకరమైన ఎమోషన్ అంతే. అందమైన రూపం కలిగిన నేను అలా డాన్స్ చెయ్యడం ఇంకా మ్యాజిక్ గా అనిపిస్తుందని భావించాను. ఐటమ్ అంటే చాలా మంది మరోలా ఊహించుకుంటున్నారు, అది సరికాదని నా అభిప్రాయం అంటూ స్పెషల్ సాంగ్స్ పై తమన్నా రియాక్ట్ అయ్యింది.