డ్రగ్స్ సేవిస్తే ఏమవుతుంది? శరీరం చిక్కుల వలయంగా మారుతుంది. అంతేకానీ రక్తం శుద్ధి అవ్వదు. అలాగే కొత్త రక్తం ఎక్కదు. కానీ ఆ నిర్మాత రక్త శుద్ధి, మంచి రక్తం ఎక్కించేందుకు బక్క చిక్కాను! అంటూ నమ్మబలుకుతున్నాడు. ఇందులో నిజం ఎంతో అతడి సన్నిహితులకు మాత్రమే స్పష్ఠత ఉంది. ఇతరులు అతడి మాటలు నమ్మాలి.
నిజానికి అతడిపై చాలా కాలంగా చాలా ఆరోపణలున్నాయి. అతడు డ్రగ్స్ కల్చర్ ని ఇండస్ట్రీ జనాలకు అలవాటు చేసిన ఘనుడు. అతడి ఇంట్లో చాలా పార్టీల్లో డ్రగ్స్ వినియోగం గురించి ఫిర్యాదులు ఉన్నాయి. ఇండస్ట్రీ అగ్ర కథానాయిక అతడిని డ్రగ్ అడిక్ట్ అంటూ పిలుస్తుంది. పబ్లిగ్గా తిడుతుంది. ఇండస్ట్రీని అతడి పార్టీలు చెడగొట్టాయని నిలదీస్తుంది. కానీ దేనినీ అతడు ఓ పట్టాన అంగీకరించడు.
ఇదంతా ఇలా ఉండగానే, ఉన్నట్టుండి ఇటీవల నగరంలో బక్క చిక్కి కనిపించి పెద్ద షాకిచ్చాడు. అతడు సడన్ గా ఇలా అవ్వడం చూసి అందరూ అవాక్కయ్యారు. అతడు ఏదో జబ్బు భారిన పడ్డాడని అంతా సందేహించారు. కానీ అవన్నీ ఊహాగానాలు మాత్రమేనని ఇప్పుడు కొట్టి పారేసాడు సదరు నిర్మాత. అంతేకాదు రక్తం పునరుద్ధరణ కోసం ఉపవాసం చేస్తున్నానని, రోజుకు ఒక పూట మాత్రమే తింటున్నానని చెప్పాడు. ఒక పూట తింటూ ఈత కొడుతూ, ఆటలాడుతూ చాలా చేస్తున్నాడట. దీనివల్ల బక్క చిక్కానని వివరణ ఇచ్చాడు.
మొత్తానికి రక్త శుద్ధి, పునరుద్ధరణ అంటూ ఏవో కథలు చెబుతున్నాడంటూ నిర్మాత శత్రువులు చెణుకులు విసురుతున్నారు. అయితే అతడు వినిపించిన స్టోరీలో నిజం ఎంతో పైవాడికే తెలియాలి. ఆ అగ్రనిర్మాత ఎవరో మీరు చాలా సులువగా కనిపెట్టగలరు.