Advertisementt

స్టార్‌డ‌మ్ వ‌దిలేసి విదేశీ పిల్ల‌తో జంప్

Sat 19th Apr 2025 10:04 AM
pranav mohanlal  స్టార్‌డ‌మ్ వ‌దిలేసి విదేశీ పిల్ల‌తో జంప్
Pranav Mohanlal is in love, and its not Kalyani Priyadarshan స్టార్‌డ‌మ్ వ‌దిలేసి విదేశీ పిల్ల‌తో జంప్
Advertisement
Ads by CJ

మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌ట‌వార‌సుడు దుల్క‌ర్ స‌ల్మాన్ ఇప్పుడు దేశంలోని పెద్ద హీరోల్లో ఒక‌డు. అత‌డు పాన్ ఇండియ‌న్ స్టార్ గా త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అయితే మ‌మ్ముట్టి వార‌సుడితో పోలిస్తే, మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మోహ‌న్‌లాల్ కుమారుడు ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్ తీరు పూర్తిగా భిన్నం. అత‌డు త‌న వ్య‌క్తిత్వంతో అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాడు. అత‌డు చాలా భిన్న‌మైన‌వాడు. కూల్ గా ఉంటాడు. వ్య‌వ‌సాయం చేస్తాడు. పొలాన్ని ప‌చ్చ‌ని పైర‌గాలిని ఆస్వాధిస్తాడు.

సంగీతం అంటే చెవి కోసుకుంటాడు. ప్ర‌యాణాలు, ట్రెక్కింగులు అంటూ కాల‌క్షేపం చేస్తాడు. నిజానికి అత‌డు ఒక మ‌హ‌ర్షి లాంటోడు. అత‌డి ఆలోచ‌నా విధానం.. లైట‌ర్ వెయిన్ లో ప్ర‌కృతి జీవ‌నాన్ని ఇష్ట‌ప‌డ‌డం చూస్తే ఎవ‌రికైనా స్ఫూర్తిగా నిలుస్తాడు. స్టార్ అయి ఇండ‌స్ట్రీని ఏలాల‌ని, తాను మాత్ర‌మే సూప‌ర్ స్టార్ కొడుకుని అనే ఫీలింగే అత‌డికి లేక‌పోవడం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఇక నేటి జెన్- జెడ్ జ‌నంలా సోష‌ల్ మీడియాల్లో ప‌డి చ‌చ్చిపోడు!

ప్ర‌ణ‌వ్ త‌న కోస్టార్ క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శినితో ప్రేమ‌లో ఉన్నాడ‌ని కొంత‌కాలంగా ప్ర‌చారం ఉంది. క‌ళ్యాణి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ప్రియ‌ద‌ర్శ‌న్ కుమార్తె. క‌థానాయిక‌గా రాణిస్తోంది. అయితే క‌ళ్యాణితో అత‌డి సంబంధం పూర్తి భిన్న‌మైన‌ది. ఆ ఇద్ద‌రూ అన్నా చెల్లెళ్ల‌లా ఉంటార‌ని కూడా సెట్లో వ్య‌క్తి చెప్పారు. న‌టి లిస్సీ అందించిన ఓ లీక్ ప్ర‌కారం.. మ‌ల‌యాళ ప్ర‌ముఖ వెబ్ సైట్ ఓ క‌థ‌నం ప్ర‌చురించింది. దాని ప్ర‌కారం.. ప్ర‌ణవ్ ప్ర‌స్తుతం జర్మ‌నీ అమ్మాయితో ప్రేమ‌లో ఉన్నాడు. అందుకే అత‌డు జ‌ర్మ‌నీ వెళ్లి వ‌స్తున్నాడు!

Pranav Mohanlal is in love, and its not Kalyani Priyadarshan:

Pranav Mohanlal is dating a girl from Germany

Tags:   PRANAV MOHANLAL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ