విజయ్ సాయి రెడ్డి గత ఐదేళ్ళలో వైసీపీ లో జగన్ తర్వాత స్థానంలో కనిపించారు. కానీ విజయ్ సాయి రెడ్డి మాత్రం తనకు వైసీపీ లో అవమానాలు జరిగాయి. నాకు జరిగిన అవమానం మరెవ్వరికీ జరగలేదు, జగన్ చుట్టూ ఉన్న కోటరీనే తనని అవమానించింది, జగన్ ను ఆయన చుట్టూ ఉన్న కోటరీ మేనేజ్ చేస్తుంది అంటూ విజయ్ సాయి రెడ్డి వైసీపీ పార్టీకే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకున్నారు.
రాజకీయాలకు రాజీనామా చేసారు కానీ ఆయనపై నమోదైన కేసులు మాత్రం ఆయన్ని నిలవనియ్యడం లేదు. లిక్కర్ స్కామ్ లో ఈ రోజు విజయ్ సాయి రెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణ జరిగిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తనను సిట్ అధికారులు నాలుగు విషయాల గురించి అడిగారు వాటికి తాను ఇచ్చిన సమాధానాలతో అధికారులు సంతృప్తి చెందారనే అనుకుంటున్నానని చెప్పారు.
ఈ స్కామ్ లోమొదటి రెండు మీటింగ్స్ ఎక్కడ జరిగాయని, ఎవరెవరు పాల్గొన్నారని అడిగారు. దానికి ఒకటి విజయవాడ, రెండోది హైదరాబాద్ లో జరిగాయని చెప్పాను. ఈ రెండు సమావేశాల్లో వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, సత్య ప్రసాద్, సజ్జల శ్రీధర్ పాల్గొన్నారని అధికారులకు చెప్పినట్లుగా తెలిపారు.
కిట్ బ్యాగ్స్ గురించి తెలియదని, మద్యం అమ్మకాల విషయంలో తాను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, రాజ్ కసిరెడ్డి వసూలు చేసిన డబ్బులు ఎవరికి వెళ్లాయో తనకు తెలియదని చెప్పానని చెప్పారు. లిక్కర్ స్కామ్ లో బిగ్ బాస్ ఎవరనేది రాజ్ కసిరెడ్డినే అడగమని అధికారులకు చెప్పినట్లుగా చెప్పారు.
ఇక వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తికి రాజకీయాలు ఎందుకని కొందరు మాట్లాడుతున్నారు, నేను కావాలని ఎంపీ పదవి అడగలేదని, తాను అడగకుండానే తనకు రాజ్యసభ పదవి వచ్చిందని చెప్పిన విజయ్ సాయిరెడ్డి మళ్లీ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తనకు ఇతరుల అనుమతి అవసరం లేదని, ప్రజలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు రాజకీయాల్లోకి వస్తానని, తాను బీజేపీలో వెళ్తున్నట్లుగా వస్తున్న వార్తలపై కుండబద్దలు కొట్టారు.