యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. జబర్దస్త్ యాంకర్ గా అందరికి దగ్గరై ఇప్పుడు వెండితెరపై హావ చూపిస్తున్న అనసూయ కొన్నాళ్లుగా బరువు పెరిగి లావుగా కనబడుతుంది. భర్త భరద్వాజ్ తో కలిసి యోగ, జిమ్ చేస్తుంది అయినా 40 ప్లస్ మహిళల్లో కనిపించే మార్పులు అనసూయ లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఎప్పుడు జిమ్ లో వర్కౌట్స్ చెయ్యడం మాత్రం మానదు. ఎంత కష్టమైనా జిమ్ లో అనసూయ వర్కౌట్స్ చేస్తూ డే స్టార్ట్ చేస్తుంది. తాజాగా అనసూయ భరద్వాజ్ జిమ్ వీడియో ని వదిలింది. జిమ్ లో అనసూయ రకరకాలుగా కష్టపడుతూ కనిపించింది. జిమ్ లో రకరకాల పరికరాలతో అనసూయ ఎక్సర్సైజులు చేస్తూ కనిపించింది.
మరి షూటింగ్ కి కాస్త బ్రేక్ దొరికినా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసే అనసూయ భర్త భరద్వాజ్, పిల్లలు తో కలిసి వెకేషన్స్ అంటూ ట్రిప్స్ ని ఎంజాయ్ చేస్తుంది. అంతే కాదు ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అలానే ఇప్పుడు జిమ్ వీడియో షేర్ చేసింది