చాలా మంది స్టార్లు రియల్ ఎస్టేట్, ఆల్కహాల్ అండ్ బేవరేజెస్, హోటల్స్ రంగంలో భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా రియల్ వెంచర్లలో పెట్టుబడుల ద్వారా అధిక లాభాల్ని ఆర్జిస్తున్న బాలీవుడ్ స్టార్ల గురించి నిరంతరం కథనాలు వెలువడుతున్నాయి. కొందరు సెన్సెక్స్, మార్కెట్ ట్రెండ్స్ పై గ్రిప్ ఉన్నవాళ్లు ఆ రకంగాను సంపాదిస్తున్నారు. సంజయ్ దత్ లాంటి నటుడు ఆల్కహాల్- బ్రూవరీస్ బిబినెస్ లో రాణిస్తున్నాడు. కొందరు నటులు బార్బర్ షాప్ చైన్ లను ప్రారంభించి కూడా లాభాలార్జించారు. సౌందర్య ఉత్పత్తుల రంగం, వస్త్ర వ్యాపారాల్లోను చాలా మంది కథానాయికలు పెట్టుబడులు పెట్టారు.
కానీ ఈ నటుడి స్టైలే వేరు. అతడు సొంతంగా ఒక ప్రయోగశాలను స్థాపించి అందులో నాణ్యమైన, విలువైన వజ్రాలను తయారు చేస్తున్నాడు. దాని ద్వారా వందల కోట్ల వ్యాపారం చేయాలనేది ప్లాన్. ఇటీవలే ప్రయోగశాలను ప్రారంభించాడని తెలుస్తోంది. దీనికోసం వందల కోట్లు పెట్టుబడి పెడుతున్నాడని మీడియాలో కథనాలొస్తున్నాయి.
అతడు నటనలోకి రాకపోయి ఉంటే ఇంకా పెద్ద బిలియనీర్ అయ్యేవాడే. అంత గొప్ప బిజినెస్ ఐడియాలజీ ఉన్న స్టార్. మార్కెట్లో ట్రెండ్స్ ను పట్టుకుని కొత్త బిజినెస్ లు ప్రారంభించి సక్సెస్ చేయడంలో అతడు నిష్ణాతుడు. దాదాపు 1200 కోట్ల నికర ఆస్తులతో దేశంలోని అత్యంత ధనికులైన సినీసెలబ్రిటీల్లో ఒకడిగా వెలిగిపోతున్నాడు. ఇంతకీ ఈ హీరో ఎవరు? అంటే.. నిస్సందేహంగా- వివేక్ ఒబెరాయ్. 12ఏళ్ల వయసుకే షేర్ మార్కెట్ పై పట్టు సాధించిన మేటి బిజినెస్ మేన్ ఒబెరాయ్. ముంబైలో రియల్ ఎస్టేట్ దిగ్గజంగా ఎదిగాడు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ కి అతడు సుపరిచితుడు. తెలుగులో `రక్త చరిత్ర`లో పరిటాల రవి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.