మే 9 అయినా హరి హర వీరమల్లు వస్తుందా. అసలు వీరమల్లు విషయంలో ఏం జరుగుతుంది అంటూ పవన్ ఫ్యాన్స్ లో అసహనం మొదలైంది. పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి వెన్ను నొప్పితో క్యాబినెట్ సమావేశాలకు వెళ్లకుండా క్యాంప్ ఆఫీస్ కి తిరిగి వెళ్లడంతో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ హెల్త్ పై రకరకాల ప్రచారాలు వినబడుతున్నాయి.
అటు చూస్తే మే 9 న వీరమల్లు రిలీజ్ తేదీ దగ్గరకొచ్చేస్తుంది. హరి హర వీరమల్లు మే 9 అంటున్నా అందుకు అనుగుణంగా ప్రమోషన్స్ మొదలు పెట్టడం లేదు మేకర్స్. దానితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో అనుమానం, అసహనం, ఆత్రుత అన్ని కనబడుతున్నాయి. కానీ హరి హర వీరమల్లు పై కాన్ఫిడెంట్ రావడం లేదు.
మళ్లీ హరి హర వీరమల్లు వాయిదా పడుతుందా అనే ఆందోళన మాత్రం వాళ్ళను వదిలిపోవడం లేదు. చూద్దాం వీరమల్లు విషయంలో ఏం జరగబోతుందో అనేది.