ఆమె ఒకప్పుడు స్కూల్ టీచర్. నెలవారీ జీతం అందుకునేది. ఆమె టీచింగ్ శైలిని ప్రజలు ఎగతాళి చేసారు. కానీ ఆమెను అదృష్టం వెంబడించింది. ప్రఖ్యాత పారిశ్రామిక వేత్తను పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా టీచర్ గా కొనసాగారు. తన మొదటి జీతం రూ.800. కానీ ఇప్పుడు ఆమె ఆస్తులు లక్షల కోట్లు. ఇంతటి ఆసక్తికరమైన ఆ వ్యక్తి ఎవరు? అంటే.. ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ.
భారతదేశంలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ. ఆమె ఒక పరోపకారి.. వ్యాపారవేత్త. చాలా మందికి స్ఫూర్తి. ముఖ్యంగా మహిళలకు ప్రేరణ. నీతాజీ 1985లో ముఖేష్ అంబానీని వివాహం చేసుకున్న తర్వాత కూడా ఉపాధ్యాయురాలిగా తన కెరీర్‌ను ప్రారంభించారనేది చాలామందికి తెలియదు. ఆమె ముంబైలోని సన్‌ఫ్లవర్ నర్సరీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేసారు.
సిమి గరేవాల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధీరూభాయ్ అంబానీ కోడలు అయిన నీతా అంబానీ తాను నెలకు రూ. 800 జీతం సంపాదించానని చెప్పారు. తాను బోధించేటప్పుడు ప్రజలు తనను చూసి నవ్వారని కూడా ఆమె ఒప్పుకుంది. అయితే టీచింగ్ తనకు సంతృప్తిని ఇస్తుంది కాబట్టి దానిని కొనసాగించారు.