త్యాగాలతోనే డ్రీమ్ లైఫ్ సాధ్యం-రకుల్ ప్రీత్

Mon 14th Apr 2025 06:04 PM
rakul preet  త్యాగాలతోనే డ్రీమ్ లైఫ్ సాధ్యం-రకుల్ ప్రీత్
Rakul Preet about her dream life త్యాగాలతోనే డ్రీమ్ లైఫ్ సాధ్యం-రకుల్ ప్రీత్
Advertisement
Ads by CJ

కెరటం చిత్రంతో తెరంగేట్రం చేసి సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్ చేరుకొని ప్రస్తుతం హిందీలో కెరీర్ కి బాటలు వేసుకుంటున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సౌత్ అవకాశాలు తగ్గడంతో ముంబై లో మకాం పెట్టడమే కాదు.. అక్కడే నిర్మాత మరియు నటుడు జాకీ భగ్నానీ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో గత ఏడాది వివాహం చేసుకుంది. 

అటు పర్సనల్ లైఫ్ ని, ఇటు సినిమా షూటింగ్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్న రకుల్ ప్రీత్ తనెంత బిజీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటానని చెబుతుంది. అంతేకాదు ఒకప్పుడు పడిన కష్టం, చేసిన త్యాగాల వలనే తానిప్పుడు డ్రీమ్ లైఫ్ ని ఆస్వాధిసున్నాను అంటూ రకుల్ చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

చిన్నప్పటి నుంచి వెండితెర పై కనిపించాలనే కలను సాకారం చేసుకోవాడనికి ఎంతో కష్టపడ్డాను, ఎన్నో త్యాగాలు చేశాను అని చెప్పిన రకుల్ ప్రీత్ అందానికి అర్ధాన్ని వివరించింది. అందం అంటే పైకి క‌నిపించేది కాదు. అందం మ‌న న‌వ్వులో, క‌ళ్ల‌లో క‌నిపించాల‌ని, అలా క‌నిపిస్తే ప్ర‌తీ ఒక్క‌రూ అందంగానే క‌నిపిస్తార‌ని రకుల్ చెబుతుంది. 

ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడమే కాదు, సోషల్ మీడియాలోనూ గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ బిజీ బిజీగా కనిపిస్తుంది. 

Rakul Preet about her dream life:

Rakul Preet Singh speaks about her dream life

Tags:   RAKUL PREET
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ