Advertisementt

ఐరిష్ బ్యూటీతో క్రికెట‌ర్ ప్రేమ‌కథ

Thu 01st May 2025 07:24 PM
shikhar dhawan  ఐరిష్ బ్యూటీతో క్రికెట‌ర్ ప్రేమ‌కథ
Shikhar Dhawan love story with Irish Beauty ఐరిష్ బ్యూటీతో క్రికెట‌ర్ ప్రేమ‌కథ
Advertisement
Ads by CJ

చాలామంది క్రికెట‌ర్లు క‌థానాయిక‌ల‌తో ప్రేమ‌లో ప‌డ్డారు. కొంద‌రు పెళ్లితో లైఫ్ లో సెటిల‌య్యారు. విరాట్ కోహ్లీ, జ‌హీర్ ఖాన్, చాహ‌ల్, యువ‌రాజ్ సింగ్, .. జాబితాలో చాలా పేర్లు ఉన్నాయి. ఇటీవ‌ల చాహల్ బ్రేక‌ప్ మీడియా వార్త‌ల్లోకొచ్చింది. అయితే చాహ‌ల్ కంటే ముందే, శిఖ‌ర్ ధావ‌న్ త‌న భార్య‌కు విడాకులు ఇవ్వ‌డం, అగ్లీ ఫైట్ కార‌ణంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలిచాడు.

భార్య‌తో బ్రేక‌ప్ వ్య‌వ‌హారం త‌ర్వాత ధావ‌న్ ఒంట‌రివాడ‌య్యాడు. ఇటీవ‌ల అత‌డికి ఐరిష్ బ్యూటీ సోఫీ షైన్ రూపంలో ఒక తోడు ల‌భించింది. షైన్ తో అత‌డు ఎంతో స‌న్నిహితంగా ఉన్నాడు. నిండా ప్రేమ‌లో ఉన్నాడ‌ని మీడియాలో నిరంత‌రం క‌థ‌నాలొస్తున్నాయి. దీనిని ధావ‌న్ కానీ, షైన్ కానీ అధికారికంగా ధృవీక‌రించ‌క‌పోయినా కానీ, సోష‌ల్ మీడియాలో వారి పోస్టులు డేటింగ్ ని ధృవీక‌రిస్తున్నాయి.

తాజాగా షైన్ తో ధావ‌న్ ఇన్‌స్టా రీల్ ఒక‌టి ఇంట‌ర్నెట్ లో జోరుగా షికార్ చేస్తోంది. ఇందులో ఈ జంట కెమిస్ట్రీ భార్యా భ‌ర్త‌ల బంధానికి త‌క్కువేమీ కాద‌ని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. జంట బావుంది.. కెమిస్ట్రీ కుదిరింది! అంటూ ప్ర‌శంసిస్తున్నారు. ఆస‌క్తిక‌రంగా ఈ ఫ‌న్నీ వీడియోలో శిఖ‌ర్ ధావ‌న్ తాను ప్రేమ‌లో ప‌డ్డాన‌ని ఒప్పుకున్నాడు. ఈ జంట ట్రెడిష‌న‌ల్ అవ‌తార్ లో క‌నిపించి ఆక‌ర్షించింది. లిమెరిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మార్కెటింగ్ & మేనేజ్‌మెంట్‌లో ప‌ట్టా పొందిన ఐరిష్ గాళ్ సోఫీ షేన్ ప్రస్తుతం అబుదాబిలోని నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో రెండవ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. ముంబైలో ధావ‌న్ తో ఎంతో స‌న్నిహితురాలిగా మారిపోయారు.

 

Shikhar Dhawan love story with Irish Beauty:

>Shikhar Dhawan in love with Irish Beauty ?

Tags:   SHIKHAR DHAWAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ