Advertisementt

రాజ‌మౌళి నంబ‌ర్ వ‌న్.. మ‌రో ప్రూఫ్

Sun 13th Apr 2025 10:33 AM
rajamouli  రాజ‌మౌళి నంబ‌ర్ వ‌న్.. మ‌రో ప్రూఫ్
Rajamouli is number one.. another proof రాజ‌మౌళి నంబ‌ర్ వ‌న్.. మ‌రో ప్రూఫ్
Advertisement
Ads by CJ

భార‌త‌దేశంలో నంబ‌ర్ -1 ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌కు వెంట‌నే స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా? రాజ‌మౌళి- రాజ్ కుమార్ హిరాణి- నితీష్ తివారీ- అట్లీ- సుకుమార్- సందీప్ రెడ్డి వంగా- చావా డైరెక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్.. ఇంకా ఈ జాబితాలో ఎవ‌రున్నారు?

నేము.. ఫేము .. బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు.. ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు .. ఇవ‌న్నీ నంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌నేది డిసైడ్ చేస్తాయి. ఆ ర‌కంగా చూస్తే ఆర్.ఆర్.ఆర్ సినిమాతో భార‌త‌దేశానికి ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఆస్కార్ అవార్డును అందించిన మొట్ట‌మొద‌టి ద‌ర్శ‌కుడిగా ఘ‌నుతికెక్కిన ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి నంబ‌ర్ -1 అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. క‌మ‌ర్షియ‌ల్ గా పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్లు అందించ‌డ‌మే గాక‌, ఆస్కార్, హాలీవుడ్ క్రిటిక్స్, గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాల‌తో ప్ర‌పంచ‌వ్యాప్త గుర్తింపు పొందారు.

ఇప్పుడు రాజ‌మౌళి మాత్ర‌మే నంబ‌ర్ -1 అనేందుకు మ‌రో ప్రూఫ్ దొరికింది. గ్లోబల్ ఐక‌న్ గా పాపులారిటీ సంపాదించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్ర‌ముఖ భార‌తీయ క‌థానాయిక ప్రియాంక చోప్రా ఎంపిక కూడా రాజ‌మౌళిని నంబ‌ర్ వ‌న్ దర్శ‌కుడు అని నిరూపిస్తోంది. నిజానికి ప్రియాంక చోప్రా హాలీవుడ్ సినిమాల్లో న‌టించి, సిటాడెల్ సిరీస్ సీజ‌న్ 2 ని పూర్తి చేసాక భార‌తీయ చిత్రంలో న‌టించాల‌ని భావించి స్క్రిప్టులు వెతికిన‌ప్పుడు రాజమౌళి, అట్లీల‌ను క‌లిసారు. ఆ ఇద్ద‌రూ పోటీప‌డి త‌న‌ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ ప్రియాంక చోప్రా మ‌రో డౌట్ లేకుండా రాజ‌మౌళిని మాత్ర‌మే ఎంపిక చేసుకున్నారు. ఆ ఇద్ద‌రూ వెయ్యి కోట్ల క్ల‌బ్ ని అందించిన ద‌ర్శ‌కులు. కానీ రాజ‌మౌళికే పీసీ ఓటేసారు. నిస్సందేహంగా రాజ‌మౌళి నంబ‌ర్ వ‌న్ ద‌ర్శ‌కుడు కాబ‌ట్టి ఈ ఎంపిక అని గ్ర‌హించాలి. పీసీకి అట్లీ చెప్పిన స్క్రిప్టు ఎక్క‌లేదు. కానీ రాజ‌మౌళి వినిపించిన స్క్రిప్ట్, పాత్ర బాగా నచ్చాయి. అందుకే గ్లోబ‌ల్ ఐకాన్ ప్రియాంక చోప్రా అత‌డి ప్రాజెక్టుకు ఓకే చెప్పార‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి.

Rajamouli is number one.. another proof:

Rajamouli number 1 here is the proof

Tags:   RAJAMOULI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ