Advertisementt

భైరవం - కన్నప్ప కోసం వెయిట్ చేస్తావా మనోజ్

Thu 10th Apr 2025 05:50 PM
kannappa  భైరవం - కన్నప్ప కోసం వెయిట్ చేస్తావా మనోజ్
Bhairavam - Will you wait for Manoj భైరవం - కన్నప్ప కోసం వెయిట్ చేస్తావా మనోజ్
Advertisement
Ads by CJ

రీసెంట్ గా మంచు మనోజ్ నేను ఆస్తి కోసం మా అన్నతో గొడవ పడడం లేదు, మా అన్న విష్ణు థియేటర్ ముందు సమోసాలు అమ్ముకోవడానికే పనికొస్తాడు, కావాలనే అందర్నీ పిచ్చోళ్ళని చేస్తున్నారు, నాకు ఆస్తులు వద్దు.. మా నాన్నకు ఎప్పుడో చెప్పాను, దొంగ కీతో నా కారును దొంగిలించాడు విష్ణు, మా అన్న విష్ణు కోసం అతని ఎదుగుదల కోసం కష్టపడ్డాను.

అన్న సినిమాలకు ఫైట్స్ కంపోజ్ చేశాను, గ్రాఫిక్ వర్క్స్ చేశాను, అన్న సినిమాలో కామెడీ కోసం అమ్మాయి వేషం వేశాను అంటూ మంచు మనోజ్ నిన్నటి నుంచి జల్ పల్లి ఇంటి ముందు డ్రామా చేస్తున్నాడు. ఆస్తి కోసం కొట్లాడడం లేదు, ప్రొఫెషనల్ గా పోటీ పడదామని నేను, కన్నప్ప చిత్రం పైకి నా భైరవం విడుదల చేద్దామనుకుని అన్నాను, కానీ నాకు భయపడి విష్ణు కన్నప్ప ని వాయిదా వేసాడు అంటూ ప్రెస్ ముందు చెప్పాడు.

అదే సమయంలో మంచు విష్ణు కన్నప్ప చిత్రాన్ని జూన్ 27 న విడుదల చేస్తున్నట్టుగా యుపి సీఎం చేతుల మీదుగా ప్రకటించాడు. మరి భైరవం చిత్రాన్ని జూన్ 27 వరకు విడుదల చెయ్యకుండా ఉంటావా మనోజ్, కన్నప్ప పైకి భైరవం వదులుతా అన్నావ్ గా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ నటించిన భైరవం రిలీజ్ కి సిద్ధమైంది, ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు. కానీ విడుదల తేదీ ఇవ్వలేదు, ఇప్పుడు భైరవం చిత్రాన్ని కన్నప్ప రిలీజ్ వరకు ఆపుతారా, కన్నప్ప పైకి వదులుతారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. 

Bhairavam - Will you wait for Manoj:

Vishnu Kannappa vs Manoj Bhairavam

Tags:   KANNAPPA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ