ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని మోహన్ బాబు జల్ పల్లి హౌస్ దగ్గర మంచు మనోజ్ గేటు బయట బైఠాయించి తన అన్న విష్ణు తన వస్తువులు ఎత్తుకెళ్లాడు, కార్లు దొబ్బుకెళ్ళాడు, నేను ఆరోగ్యకరమైన పోటీగా తను నటించిన భైరవం చిత్రాన్ని కన్నప్ప చిత్రానికి పోటీగా రిలీజ్ చేస్తాను అనబట్టే మంచు విష్ణు తన ఇంటి నుంచి సామన్లు ఎత్తుకుపోయాడంటూ మీడియా ముందు రచ్చచేస్తున్నాడు.
అదే మయంలో మంచు విష్ణు మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం విశేషం. యుపి సీఎం యోగి ఆదిత్యనాధ్ ని కలిసిన మంచు విష్ణు, మంచు మోహన్ బాబు, ప్రభుదేవా లు ఆయన చేతుల మీదుగా కన్నప్ప కొత్త రిలీజ్ తేదిని ప్రకటించారు. ఏప్రిల్ 25 న విడుదల కాబాల్సి ఉన్న కన్నప్ప చిత్రాన్ని గ్రాఫిక్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో పోస్ట్ పోన్ చేసారు మేకర్స్.
తాజాగా మంచు విష్ణు యుపి సీఎం చేతుల మీదుగా కన్నప్ప చిత్రాన్ని జూన్ 27 న విడుదల చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. అక్కడ మంచు మనోజ్.. మోహన్ బాబు ఇంటి ముందు రచ్చ చేస్తుంటే ఇక్కడ మోహన్ బాబు, విష్ణు లు కన్నప్ప కొత్త తేదీ ప్రకటనలో బిజీగా వున్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.