అఖిల్ బర్త్ డే కి #Akhil6 నుంచి డబుల్ ట్రీట్ అందింది అక్కినేని అభిమానులకు. రెండేళ్లుగా ఆకలిగా ఉన్న అభిమానులు #Akhil6 ట్రీట్ తో శాంతించారు. వినరో భాగ్యము విష్ణు కథ చిత్రంతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మురళీ కిశోర్ అబ్బూరు.. ఇంటన్స్, యాక్షన్ ప్యాక్డ్ ఎక్స్ పీరియన్స్ తో రాయలసీమ నేపథ్యంలో రోమాలు నిక్కబొడుచుకునేలా అఖిల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది.
#Akhil6 కి లెనిన్ అనే టైటిల్ తో పాటుగా గ్లింప్స్ ని కూడా అఖిల్ బర్త్ డే ట్రీట్ గా వదిలారు మేకర్స్. ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ పవర్‌ఫుల్ విజువల్స్‌తో ప్రారంభమయ్యింది. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటుంది రా, పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది అని రాయలసీమ స్లాంగ్‌లో అఖిల్ చెప్పిన డైలాగ్ సింపుల్‌గా అదుర్స్ అంతే అంటూ లెనిన్ గ్లింప్స్ తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
లెనిన్ టైటిల్ కి ట్యాగ్ లైన్ ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు అంటూ పెట్టారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన బ్యూటిఫుల్ శ్రీలీల హీరోయిన్ గా కనిపించబోతున్నట్టుగా లెనిన్ గ్లింప్స్ తోనే ప్రకటించారు. అఖిల్ లెనిన్ లుక్ చూస్తుంటే.. స్టన్నింగ్ లెనిన్ కేరక్టర్‌కి అద్భుతంగా సూట్ అయ్యారు. దట్టమైన మీసం, పొడవాటి జుట్టు, మ్యాచో అవతార్‌కి అఖిల్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. స్ట్రైకింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అఖిల్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ ఇచ్చెసినట్లే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.