Advertisementt

తప్పుడు వ్యక్తులను వెనకేసుకొస్తున్న జగన్

Tue 08th Apr 2025 04:26 PM
jagan  తప్పుడు వ్యక్తులను వెనకేసుకొస్తున్న జగన్
Jagan Warning to Police Officers తప్పుడు వ్యక్తులను వెనకేసుకొస్తున్న జగన్
Advertisement
Ads by CJ

తన ప్రభుత్వంలో మితిమీరి వ్యవహారించడమే కాదు, అధికార దుర్వినియోగం చేసి, అవినీతికి పాల్పడిన నేతలను కూటమి ప్రభుత్వంలో అరెస్ట్ చేస్తుంటే జగన్ మాత్రం అదంతా చంద్రబాబు, లోకేష్, పవన్ లు కావాలని పగ పెట్టుకుని కుట్రపూరితంగా తన నేతలను అరెస్ట్ చేసినట్టుగా ప్రజల ముందు చెప్పుకునే ప్రయత్నం చెయ్యడం ఏమిటో అంటూ టీడీపీ కార్యకర్తలు షాకవుతున్నారు. 

తాజాగా జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనకు వెళ్లారు. పాపిరెడ్డిపల్లిలో ఫ్యాక్షన్‌ రాజకీయానికి బలైన కురుబ లింగమయ్య కుటుంబాన్ని సందర్శించిన తర్వాత జగన్ మట్లాడుతూ చంద్రబాబు, లోకేష్, పవన్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిని, నందిగం సురేష్ ని, ఈవీఎం లను ధ్వంశం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలను తప్పులేకుండా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది అని చెప్పడం హాస్యాస్పదం అయ్యింది.  

సురేష్, పోసాని, పిన్నెల్లి, వల్లభనేని వంశీ ల అరెస్ట్ లు కుట్ర పూరితం అని, ప్రభుత్వం, పోలీసులు కలిసి చేస్తున్న నేరాలని జగన్ సన్సెషనల్ కామెంట్స్ చేసారు. ఎల్లకాలం చంద్రబాబు పాలన కొనసాగదు. తప్పు చేసిన వారిని మేము అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టం. బాబుకు ఊడిగం చేసే వారికి శిక్ష తప్పదు. యూనిఫాం తీయించి చట్టం ముందు నిలబెడతాం అంటూ జగన్ పోలీస్ లను బెదిరించారు. 

మరి పోసాని, నందిగం సురేష్, పిన్నెల్లి, వంశీ ఎందుకు అరెస్ట్ అయ్యారో ప్రజలంతా చూసారు, జగన్ మాత్రం అవి కుట్ర పూరిత అరెస్ట్ లు అనడం నిజంగా కామెడీ అని, పోసాని కి నోరు ఉంది కాదా అని ఇష్టం వచ్చినట్టుగా వాగాడు, పిన్నెల్లి ఈవీఎం లు పగలగొట్టడం రాష్ట్రమంతా చూసింది, నందిగం సురేష్ అవినీతి అందరికి తెలుసు అలాంటి వారిని జగన్ వెనకేసుకురావడం అనేది ఎంతవరకు కరెక్ట్  అంటూ టీడీపీ వాళ్ళు జగన్ పై ఫైర్ అవుతున్నారు. 

Jagan Warning to Police Officers:

YS Jagan About Illegal Arrest In AP And Warning To Police Officers

Tags:   JAGAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ