Advertisementt

తారక్ కు ప్రేమతో సుక్కు

Mon 07th Apr 2025 11:03 AM
ntr  తారక్ కు ప్రేమతో సుక్కు
Young Tiger bond with Star Director goes viral తారక్ కు ప్రేమతో సుక్కు
Advertisement
Ads by CJ

పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సుకుమార్, దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎన్టీఆర్ కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే, అది కూడా ఒకరి భుజం మీద మరొకరు వాలి కనిపిస్తే అభిమానుల్లో అనేక రకాల అనుమాలు కలుగుతాయి. తాజాగా ఎన్టీఆర్-సుకుమార్ కలిసి ఉన్న పిక్ ని సుకుమార్ భార్య తబిత సోషల్ మీడియాలో షేర్ చేసారు. 

తారక్ కు ప్రేమతో అంటూ క్యాప్షన్ ఇచ్చి సుకుమార్ భార్య సుకుమార్ ని కూడా ట్యాగ్ చేశారు. ఆ తర్వాత అదే పోస్ట్ ను ఎన్టీఆర్ రీ పోస్ట్ చేశారు. అంతేకాదు.. నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ అంటూ సుకుమార్ ను ట్యాగ్ చేశారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్-సుకుమార్ పిక్ ట్రెండింగ్ లో కొచ్చేసింది. 

సుకుమార్-ఎన్టీఆర్ కలిసి నాన్నకు ప్రేమతో చిత్రం చేసారు. ఆ తర్వాత వీరి కలయికలో మరో మాస్ మూవీ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు, కానీ అది కార్యరూపం దాల్చలేదు, మరి సుక్కు-ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్ చూసాక ఎన్టీఆర్-సుకుమార్ మళ్లీ కలిసి సినిమా చేస్తే బావుంటుంది అని అభిమానులు ముచ్చటపడుతున్నారు. 

Young Tiger bond with Star Director goes viral:

NTR-Sukumar pic increases speculation

Tags:   NTR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ