Advertisementt

అమెరికాను మోసం చేసిన ఇండియా

Sat 05th Apr 2025 01:29 PM
india  అమెరికాను మోసం చేసిన ఇండియా
India betrayed America అమెరికాను మోసం చేసిన ఇండియా
Advertisement
Ads by CJ

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌పంచ దేశాల‌పై విషం క‌క్కుతున్నాడు. తాజాగా ప‌న్ను బాదుడుతో క‌క్ష సాధింపును ప‌రాకాష్ట‌కు చేర్చాడు. ఇక‌పై భార‌త్, చైనా, యూరోపియ‌న్ యూనియ‌న్ దేశాలు స‌హా మ‌రో ప‌ది దేశాల‌ నుంచి ఎగుమ‌తి అయ్యే వ‌స్తువుల‌పై చాలా ప‌న్ను భారం ప్ర‌జ‌లు మోయాల్సి ఉంటుంది. 

`మీరంతా మా దేశాన్ని మోసం చేసారు.. అత్యాచారం చేసారు.. మీరు చీట‌ర్స్.. అందుకే వ‌సూలు చేస్తున్నాను!` అని తీవ్ర ప‌ద‌జాలంతో భార‌త్, చైనా స‌హా ప్ర‌పంచ దేశాల‌ను ట్రంప్ ఆడిపోసుకున్నారు. అంతేకాదు భార‌త‌దేశం నుంచి ఎగుమ‌తి అయ్యే ఉత్ప‌త్తుల‌పై కేవ‌లం 5 -10 శాతం మాత్ర‌మే ఇంత‌కుముందు ప‌న్ను ఉండేది. ఇప్పుడు ఏకంగా 26 శాతానికి పెంచాడు ట్రంప్. అంటే ఏకంగా 16-20శాతం అద‌న‌పు ప‌న్ను భార‌తీయ ఎగుమ‌తుల నుంచి ఇక‌పై వ‌సూలు చేయ‌బోతున్నాడు. మ‌న దేశం నుంచి ట‌వ‌ల్స్ స‌హా చాలా గృహోప‌క‌ర‌ణాలు అమెరికాకు ఎగుమ‌తి అవుతున్నాయి. వాట‌న్నిటిపైనా ట్రంప్ ప‌న్ను భారం మోపాడు. దిగుమ‌తుల‌పై ఏకంగా ప‌ది శాతం బేస్ ప‌న్ను పెంచ‌డం షాకిచ్చింది. అయితే కెనడా- మెక్సికో లాంటి దేశాలు అదనపు సుంకాల బాదుడు నుండి తప్పించాడు.

భార‌త‌దేశ ఎగుమతుల‌పై 26 శాతం, చైనా వస్తువులపై 34 శాతం, యూరోపియన్ యూనియన్ నుండి దిగుమతులపై 20 శాతం, దక్షిణ కొరియా ఉత్పత్తులపై 25 శాతం,  తైవానీస్ వస్తువులపై 32 శాతం, జపాన్ ఎగుమతులపై 24 శాతం ఇక‌పై వ‌సూలు చేస్తారు. ప‌న్నుల బాదుడుకు మిత్ర‌దేశం శ‌త్రు దేశం అనే విభేధ‌మే ట్రంప్ కి లేదు. అత‌డు ఈ ఏప్రిల్ నుంచి ప‌న్ను బాదును నిర్ధేశించ‌డంతో ఇప్పుడు ప్ర‌పంచ దేశాల్లో క‌ల‌క‌లం రేగింది. ఇది అన్ని  దేశాల‌తో స‌త్సంబంధాల‌ను నాశ‌నం చేసుకోవ‌డ‌మేన‌ని విశ్లేషిస్తున్నారు. అయితే దేశాధ్య‌క్షుడైన‌ ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి మిత్ర‌దేశ‌మైన భార‌త‌దేశం కూడా అమెరికాపై ఇన్నాళ్లుగా అత్యాచారం చేసింద‌ని భావించాల్సి ఉంది.

India betrayed America:

India Betrayal of America

Tags:   INDIA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ