నాగ చైతన్య-శోభితలు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు, వీరిద్దరూ ఫస్ట్ టైమ్ కలిసి వోగ్ ఇంటర్వ్యూలో పాల్గొనడమే కాదు, చాలా విషయాలను మనసు విప్పి మాట్లాడారు. చైతు నేను చాలా సినిమాలు చూస్తాను అంటే, చైతు సినిమాలు చూస్తుంటే నాకు చై ని చూస్తుండడం ఇష్టమని చెప్పింది శోభిత. చై 100 సినిమాలు చూస్తే నేను ఐదు సినిమాలు చూస్తాను అని చెప్పింది.
ఇక ఇద్దరిలో ముందుగా సారీ చెప్పాల్సి వస్తే ముందు నేనే చెబుతా అంది శోభిత. దానికి చైతు నీకు థాంక్స్, సారీ లపై నమ్మకం ఉండదు కదా అని సరదాగా ఆట పట్టించాడు. ప్రేమలో థాంక్స్ లకు, సారీ లకు చోటు ఉండకూడదు అని చెప్పింది. అలానే ముందు తానే శోభితకు ప్రపోజ్ చేసిన విషయాన్ని చై రివీల్ చేసేసాడు. శోభిత సరదాగా ఉంటుంది. నాకు ఫేమస్ హుక్ స్టెప్స్ నేర్పిస్తుంది. అది తనకు హాబీ.
ఇక మా ఇద్దరికీ వంట రాదు, కానీ చై నాకు షూటింగ్ నుంచి రాగానే హాట్ చాకోలెట్ చేసిస్తాడు అని చెప్పింది. శోభిత అనారోగ్యం పాలైనప్పడు అస్సలు ఓర్చుకోలేదు, ప్రాణం పోయినంత పని చేస్తుంది, చాలా హడావిడి చేస్తుంది. నీరసం వచ్చి పడిపోతుంది అంటూ శోభిత ని చైతు ఆటపట్టించాడు.