ప్రస్తుతం మంచు వారి ఫ్యామిలీ ఆస్తి గొడవలు రచ్చ కెక్కాయి, మంచు విష్ణు vs మంచు మనోజ్ ల నడుమ తగాదాలు రోజు రోజుకి ముదిరి పాకాన పడుతున్నాయి. మోహన్ బాబు కూడా చిన్నకొడుకు మనోజ్ కి ఎదురు తిరగడం హాట్ టాపిక్ అయ్యింది. ఇరువురు కేసులు పెట్టుకుని పోలీస్ స్టేషన్స్ చుట్టూ తిరుగుతున్నారు.
ఇలాంటి సమయంలో మోహన్ బాబు బర్త్ డే రావడం, మంచు మనోజ్ తండ్రికి బర్త్ డే విషెస్ చెబుతూ చేసిన ట్వీట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. హ్యాపీ బర్త్ డే నాన్నా, మనమంతా కలిసి నీ పుట్టినరోజు వేడుకలు జరుపుకునే ఈరోజు మీ పక్కన ఉండే అవకాశం కోల్పోయాం. మీతో ఉండే క్షణాల కోసం ఎదురు చూతున్నాము, లవ్ యు నాన్నా అంటూ మనోజ్ ట్వీట్ చేసాడు.
తన కుమార్తె తండ్రి మోహన్ బాబు పిక్ ని ముద్దాడుతున్న పిక్ తో పాటుగా మోహన్ బాబు సినిమా వీడియో ని మనోజ్ షేర్ చేసాడు. ప్రస్తుతం తండ్రికి విషెస్ చెబుతూ మనోజ్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.