Advertisementt

అంతా సాక్షిదే నాదేమి లేదు-పోసాని

Wed 19th Mar 2025 10:27 AM
posani  అంతా సాక్షిదే నాదేమి లేదు-పోసాని
Everything is a Sakshi nothing is mine - Posani అంతా సాక్షిదే నాదేమి లేదు-పోసాని
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రిమాండ్ ఖైది గా ఉన్న నటుడు పోసాని కృష్ణ మురళిని ఏపీ సీఐడీ పోలీసులు నిన్న మంగళవారం విచారించారు. ముందుగా జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేయించాక సీఐడీ కార్యాలయానికి తరలించి పోసానిని విచారించారు. ఈ విచారణలో పోసాని కృష్ణ మురళి హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మీవద్ద ఉన్న ఆధారాలు ఏమిటి. 

దానికి పోసాని ఆరోజు చంద్రబాబు, పవన్, లోకేష్ పై నేను మాట్లాడిన అంశానికి సంబంధించి నాకేమీ తెలీదు. ఆ రోజు సాక్షి మీడియా వాళ్లే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారిచ్చిన స్క్రిప్ట్ చదివా. వారిచ్చిన ఫొటోలనే చూపించాను. ఆ ఫోటోలను ఎవరిచ్చారు అని సీఐడీ అధికారులు అడగగా.. 

తెలియదు, గుర్తులేదు. సాక్షి వారు ఇచ్చిన స్క్రిప్ట్ ను చూసుకోకుండానే మాట్లాడాను. నేను ఎవరినీ తిట్టలేదు. అది మార్ఫింగ్‌ వీడియో. నా ఫ్యామిలీ గురించి తప్పుగా మాట్లాడితే కోపం వచ్చి, ఆవేశంగా మాట్లాడాల్సి వచ్చింది అన్న పోసానిని.. వైసీపీ నుంచి ఎంత తీసుకున్నారు, అలా మాట్లాడినందుకు అని అధికారులు అడగగా.. దానికి నేను వైసీపీ పార్టీ నుంచి ఎలాంటి లబ్ది పొందలేదు అంటూ పోసాని విచారణలో చెప్పినట్లుగా అని తెలుస్తోంది. 

Everything is a Sakshi nothing is mine - Posani:

Posani Krishna Murali custody

Tags:   POSANI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ