Advertisement

Ads by CJ

జనసేన సభ పై జనాగ్రహం

Sun 16th Mar 2025 09:19 PM
pawan kalyan  జనసేన సభ పై జనాగ్రహం
Public outcry over Janasena Sabha జనసేన సభ పై జనాగ్రహం
Advertisement
Ads by CJ

జన సేన సభపై కూటమి అభిమానులు పెదవి విరుస్తున్నారు.. నాగబాబు మాట్లాడిన తీరు, సీటు త్యాగం చేసిన వర్మ పై పరోక్షముగా చేసిన కామెంట్స్ వాళ్ళ ఖర్మ అనటం, సోషల్ మీడియాలో గట్టిగా వేసుకొంటున్నారు.. ఓ అభిమాని పెట్టిన పోస్ట్ యధాతదంగా..

ఇంకా సినిమా చాలా ఉంది! 

కొందరు అంతే.. ఎప్పుడు అర్ధం చేసుకుంటారో తెలియదు! వాపును చూసి ఇంకేదో అనుకుంటారు! ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ తో రెచ్చిపోతుంటారు! సరే, రాసినోడికి బుర్ర లేదనుకుందాం! రాష్ట్రంలో గౌరవప్రద హోదాలో వున్న మీకేమైంది సార్? 

100% స్ట్రైక్ రేట్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నదమ్ములు! ఎప్పుడు చెప్పుకుంటారు? ఎవరి మద్దతు లేకుండా గెలిచినప్పుడు కదా మీ పార్టీకి వున్న సత్తా ఏంటో తెలిసొచ్చేది! ఒంటరి పోరులో ఏమైంది జనం చూసారుగా! ఒక్కటే వచ్చింది! రెండు చోట్ల నిలబడినా అడ్రస్ లేరుగా! కనీసం ఆ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు అప్పట్లో! యాది వుందా సార్! 

మిమ్మల్ని కాదు, జగన్ ను అనాలి! పెద్దాయన్ని జైలులో వేయకుండా ఉండి ఉంటే ఇప్పుడు అధికారంలో ఎవరున్నా లేకున్నా మీరు మాత్రం వుండే వాళ్ళు కాదు! మీకు వచ్చిన ఓట్ల శాతం ఏడు మాత్రమే! మిగతా రెండు పార్టీల శాతంతో పోల్చుకుంటే హండ్రెడ్ పర్సంట్ స్ట్రైక్ రేటు పార్టీ శాతం ఎంత? మీ టర్నింగ్ పాయింట్ ఒక్కటే! రాజమండ్రి జైలులో పెద్దాయన్ని కలసి వచ్చాక మీడియాతో మాట్లాడారు చూడండి ఎంతో హుందాగా.. అదే టర్నింగ్ పాయింట్! 

మీకంటూ ఆలోచన ఉండదా? కాసేపు కమ్యూనిస్ట్ అంటారు! కాసేపు రాముడి భక్తుడినంటారు! చేగువేరా, దాశరథి పరువు తీస్తారు! నిలబడే ముందు అంతా నీ చేతుల్లో పెడుతున్న అన్నారు! ఇప్పుడేమో నీ ఖర్మ అంటున్నారు! వాడెవడో ఎప్పుడో ఏదో అన్నాడని ఇన్నాళ్లకు గుర్తు చేసి మతాల మధ్య రెచ్చగొడతారు! రాష్ట్రంలో ముఖ్యమంత్రి తరువాత ముఖ్యమంత్రి! ఎంత హుందాగా ఉండాలి! ఎలా కలుపుకుపోవాలి! కేంద్రం ఏదో చెప్పిందని మళ్ళీ తెలంగాణలో పాగా వేయడానికి మాయ మాటలు చెబితే ఇక్కడ నమ్మడానికి రెడీ గా ఎవ్వరూ లేరు! జన్మ అంటారు! పునర్జన్మ అంటారు! తెలంగాణ వచ్చినప్పుడు అన్నం సహించలేదని చెప్పింది జనం మరచిపోయి వుంటారనేగా! 

అది పార్టీ ఆవిర్భావ పుష్కర సభ! కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయాల్సిన సభ! అన్నదమ్ములు రెచ్చిపోయి రెచ్చగొట్టి మాట్లాడి కార్యకర్తలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో మీకైనా అర్థమైందా? 42 ఏళ్ల పార్టీ టిడిపి! ఆ పార్టీ ఆ కార్యకర్తలకు వారి నాయకులకు అదొక ఎమోషన్! 12 ఏళ్ల పార్టీ మీది! సంస్థాగతంగా  పునాదులు ఇంకా గట్టి పడలేదు! బిజెపి, టిడిపి సహకారంతో పదవులు, హోదా వచ్చేసాయి! ఇప్పటికైనా పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించకుండా నిన్న హాజరైన జనం చూసి రెచ్చిపోతే ఎలా? అక్కడ నిన్న వున్న జనం అంతా అన్ని పార్టీలకు చెందిన వారు అని తెలుసుకోనంత కాలం మీ పార్టీ రాజకీయంగా బలపడదు! కూటమిలో ఉన్నప్పుడు ఆచి తూచి మాట్లాడాలి! వారం కూడా కాలేదు మొక్కి మొక్కి నామినేషన్ వేసి! తమ్ముడ్ని చూసి అప్పుడే రెచ్చిపోతే ఎట్లా! ఇంకా చాలా సినిమా ఉంది! 

Public outcry over Janasena Sabha:

Public Reaction On Pawan Kalyan Janasena 12th Formation Day Meeting

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ