Advertisementt

కల్కి 2 షూటింగ్ ఎప్పటినుంచి అంటే

Sun 16th Mar 2025 06:19 PM
kalki 2  కల్కి 2 షూటింగ్ ఎప్పటినుంచి అంటే
Amitabh Bachchan To Start Kalki 2 కల్కి 2 షూటింగ్ ఎప్పటినుంచి అంటే
Advertisement
Ads by CJ

ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏ.డి భారీ విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించింది. ఈ చిత్ర విజయానికి కొనసాగింపుగా కల్కి 2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సినీ అభిమానులు ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పుడే ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన టీవీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి పూర్తయిన వెంటనే కల్కి 2 షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలిపారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని మొదటి షెడ్యూల్ జూన్ 15 వరకు జరగనుందని టాక్.

మరోవైపు మొదటి భాగంలో ప్రధాన పాత్ర పోషించిన దీపికా పదుకొణె ఈ సీక్వెల్‌లోనూ కొన్ని కీలకమైన సన్నివేశాల్లో కనిపించనుందని సమాచారం. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న స్వప్న సినీ ప్రొడక్షన్స్, తొలి భాగం షూటింగ్ సమయంలోనే కల్కి 2 కు సంబంధించిన కొన్ని భాగాలను చిత్రీకరించినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 35 శాతం షూటింగ్ పూర్తయిందని సమాచారం.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతుండటంతో మేకర్స్ నుంచి మరిన్ని అప్‌డేట్స్ కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Amitabh Bachchan To Start Kalki 2:

Amitabh Bachchan To Start Kalki 2 In May 2025

Tags:   KALKI 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ