ఈరోజు ఆదివారం ఉదయం గుండెపోటుతో చెన్నై లోని ఆసుపత్రిలో చేరిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కు అపోలో వైద్యులు ఐసియులో ఉంచి గుండెలకు సంబందించిన ఈసీజీ, యాంజియోగ్రామ్ లాంటి టెస్ట్ లు నిర్వహించి వైద్యం అందించినట్లుగా తెలుస్తుంది.
అయితే రెహమాన్ కోలుకోవడంతో అపోలో వైద్యులు రెహమాన్ ను డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించినట్లుగా అపోలో హాస్పిటల్ రహ్మాన్ హెల్త్ బులిటెన్ వదిలారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్, డీహైడ్రేషన్ కారణంగా రహమాన్ అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం రహమాన్ కోలుకున్నారని తెలిపారు.
చికిత్స అనంతరం రహమాన్ కోలుకోవడంతో ఆయనను డిస్చార్జ్ చేసి ఇంటికి పంపించినట్లుగా, రెహమాన్ ఆరోగ్యంగానే ఉన్నట్లుగా ఆయన సోదరి ఇచ్చిన అప్ డేట్ తో రెహమాన్ అభిమానులు రిలాక్స్ అవుతున్నారు.