బాలీవుడ్ క్యూట్ అండ్ బ్యూటిఫుల్ ఎవరు అంటే ముందుగా అలియా భట్ పేరే చెబుతారు. కెరీర్ పీక్స్ లో ఉండగానే స్టార్ హీరో రణబీర్ కపూర్ ని వివాహమాడడమే కాదు, రాహాకు తల్లిగా మారిన అలియా భట్ ఫిట్ నెస్ విషయం మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తల్లయినా ఏ మాత్రం అందం తగ్గకుండా అద్భుతమైన లుక్ లో ఫిట్ నెస్ ని ప్రదర్శిస్తుంది.
తాజాగా BAZAAR మ్యాగజైన్ కవర్ పేజీ కోసం అలియా భట్ అందాల ఆరబోత చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. విభిన్నమైన లుక్, సింపుల్ హెయిర్ స్టైల్, బట్ అదిరిపోయే గ్లామర్ తో ఆలియా భట్ మతి పోగొట్టింది. ఆకట్టుకునే అందంతో పాటు అకర్షణనీయమైన లుక్ తో అలియా భట్ అందాలు గురించి యూత్ మొత్తం కథలు కథలు గా మాట్లాడుకొవాల్సిందే.
ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తున్న ఆలియా భట్ బిజీ తార. ఆమెను సౌత్ సినిమాల్లోకి తెచ్చుకోవాలని చాలామంది దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నా అలియా భట్ డేట్స్ మాత్రం అందని ద్రాక్షలా తయారయ్యాయి.