Advertisementt

మళ్ళీ ప్రేమలో పడిన ఆమిర్ ఖాన్

Fri 14th Mar 2025 12:11 PM
aamir khan  మళ్ళీ ప్రేమలో పడిన ఆమిర్ ఖాన్
Aamir Khan confirms dating మళ్ళీ ప్రేమలో పడిన ఆమిర్ ఖాన్
Advertisement
Ads by CJ

ఆమిర్ ఖాన్ కొద్దిరోజులుగా సినిమాలేవి చెయ్యకుండా నటనకు బ్రేక్ తీసుకున్నారు. తాజాగా ఆయన త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మ‌హాభార‌తం గురించి ఆమిర్ చెబుతూ.. దీనికి సంబంధించిన రీసెర్చ్ జ‌రుగుతోంద‌ని చెప్పారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ కోసం ఒక టీంను ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని చెప్పిన ఆమిర్ తన పర్సనల్ విషయాలపై ఓపెన్ అయ్యారు.  

తాను డేటింగ్ లో ఉన్న విషయాన్నీ బయటపెట్టారు. గతంలో తన చిన్న నాటి ఫ్రెండ్ రీనా దత్తాను ప్రేమ వివాహం చేసుకున్న ఆమిర్ ఆ తర్వాత ఆమెతో విడిపోయి కిరణ్ రావు కు దగ్గరయ్యారు. కొన్నేళ్ల‌కు కిర‌ణ్ రావును పెళ్లాడిన ఆమిర్ నాలుగేళ్ల కింద‌ట కిరణ్ రావు తో విడిపోయి విడాకులు తీసుకున్న సంగ‌తి తెలిసిందే. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. 

తాజాగా ఆమిర్ తాను మరో మహిళతో డేటింగ్ చేస్తున్నట్లుగా చెప్పి అందరికి షాకిచ్చారు. గౌరీ స్ప్రాట్ అనే బెంగ‌ళూరుకు చెందిన త‌న ఫ్రెండ్ తో  ఏడాదిగా డేటింగ్ చేస్తున్న‌ట్లు ఆమిర్ రివీల్ చేసారు. గౌరీ త‌న‌కు 25 ఏళ్లుగా తెలుస‌ని.. ఆమె మంచి స్నేహితురాల‌ని ఆమిర్ చెప్పారు. 60 ప్లస్ ఏజ్ లోను ఆమిర్ మరో కొత్త తోడుని వెతుకున్నారు. అయితే ఆమిర్ కొత్తగా డేటింగ్ చేస్తున్న గౌరీకి ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. 

మరి ఆమిర్ ఖాన్ గౌరిని పెళ్లాడుతాడా, లేదంటే సహజీవనం చేస్తారా అనేది ప్రస్తుతం బాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో సస్పెన్స్ గా మారింది. 

Aamir Khan confirms dating:

Aamir Khan confirms dating long-time friend Gauri Spratt

Tags:   AAMIR KHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ