భగవంత్ కేసరి హిట్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తన తదుపరి మూవీని మరో సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవితో ప్రాజెక్ట్ లైన్ లో పెట్టారు. సంక్రాంతికి వస్తున్నాం థియేటర్స్ లోనే కాదు, ఓటీటీ లోను, టివీ ప్రీమియర్స్ తోనూ రికార్డ్ సృష్టించింది.
అంత గొప్ప సక్సెస్ తో రిలాక్స్ అయిన అనిల్ రావిపూడి ఇమ్మిడియట్ గా మెగాస్టార్ తో చెయ్యబోయే మూవీ స్క్రిప్ట్ పై కూర్చున్నారు. తనకు సెంటిమెంట్ అయిన వైజాగ్ లో చిరు తో చెయ్యబోయే మూవీ కథ రాయడానికి వెళ్లిన అనిల్ రావిపూడి ఇప్పటికే చిరు తో చెయ్యబోయే మూవీ ఫస్ట్ హాఫ్ ని డైలాగ్ వెర్షన్ తో పాటుగా లాక్ చేసినట్లుగా తెలుస్తుంది.
దానితో అనిల్ రావిపూడి టీమ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ కి తిరిగొచ్చింది. చిరు-అనిల్ రావిపూడి సినిమాకి సంబంధించి సెకండాఫ్ పనులు ఇక్కడే హైదరాబాద్ లోనే త్వరలో మొదలవుతాయి అని తెలుస్తుంది. ఈ చిత్రానికి నిర్మాతగా సాహుగారపాటి చేయనున్నారు.