సమంత అక్కినేని యువ హీరో నాగ చైతన్యను ప్రేమించి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకుంది. కానీ ఆ పెళ్ళి నాలుగేళ్లకే పెటాకులయ్యింది. నాగ చైతన్య-సమంత మనస్పర్థల కారణంగా విడిపోయారు. విడాకులు తీసుకున్నాక ఎవరికి వారే తమ తమ పనుల్లో బిజీ అయ్యారు.
ఈమధ్యనే నాగ చైతన్య మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్లను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆతర్వాత సమంత పై బోలెడన్ని రూమర్స్ చక్కర్లు కొట్టాయి. సమంత మరొకరితో డేటింగ్ లో ఉంది అనే పుకార్లు షికార్లు చేసాయి. ఇక చైతన్య తో విడిపోయాక పాత గుర్తులైన వెడ్డింగ్ గౌన్ ని కలర్ మార్చేసి రీ మోడలింగ్ చేయించినట్టుగా చైతు తో ఎంగేజ్మెంట్ రింగ్ ని కూడా మార్చేసిందట.
చైతూతో విడిపోయాక చైతు గుర్తులను తీసేసిన సమంత తాజాగా తన ఎంగేజ్మెంట్ రింగ్ ని పెండెంట్ గా మార్చేసి.. బంగారు చైన్ లో ఆ లాకెట్ ని డిజైన్ చేయించి అప్పుడప్పుడు తన మెడలో ధరిస్తూ ఉంటుందట. సో ఆ ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్ ను సమంత పక్కనపడెయ్యకుండా ఇలా వాడేస్తుందా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.