నందమూరి బాలకృష్ణ వరసగా నాలుగు భారీ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ తో బాలయ్య బాక్సాఫీసుని హడలెత్తించారు. ప్రస్తుతం పవర్ ఫుల్ మాస్ డైరెక్టర్ బోయపాటి తో అఖండ 2 తాండవం చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది.
డాకు మహారాజ్ థియేటర్స్ కన్నా ఓటీటీ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. నెట్ ఫ్లిక్స్ లో డాకు మహారాజ్ వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. దానితో బాలయ్య-బోయపాటి అఖండ 2 పై ప్రముఖ ఓటీటీ సంస్థలు కన్నేశాయి. డాకు మహారాజ్ కన్నడ, తమిళ, హిందీ వెర్షన్స్ కలిపి 60 కోట్ల మేర ఓటీటీ డీల్ జరిగినట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడు అఖండ 2 కి పాన్ ఇండియాలోని పలు భషాల్లో దాదాపుగా 80 కోట్ల రికార్డ్ ప్రైస్ ని ప్రముఖ ఓటీటీ సంస్థలు కోట్ చేసి అఖండ 2 డిజిటల్ హక్కుల కోసం పోటీపడుతున్నట్లుగా టాక్ ఉంది. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న అఖండ 2కి ఈమేర ఓటీటీ డీల్ సెట్ అయితే సగం బడ్జెట్ నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే కవర్ అవుతాయని చెబుతున్నారు.