హైదరాబాద్ లో సెట్ వేసి స్టార్స్ నుంచి, నటుల నుంచి, టెక్నీకల్ సిబ్బంది నుంచి గుట్టు చప్పుడు కాకుండా ఫోన్ లన్ని తీసేసుకుని అందులో షూటింగ్ చేస్తే ఎలాంటి లీక్ బయటకు రాదు. అదే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న చిత్రానికి పాటిస్తున్న నిబంధనలు. సెట్ వరకు అయితే ఓకె.
కానీ అవుట్ డోర్ వెళ్ళినప్పుడు దేనిని రాజమౌళి ఆపలేరు. ఎలాంటి లొకేషన్ లో SSMB 29 షూటింగ్ చేసినా ఇట్టే లీకులు బయటకి వచ్చేస్తాయి. ప్రియాంక చోప్రా కానీ, పృథ్వీ రాజ్ సుకుమారన్ కానీ SSMB 29 లో నటిస్తున్నారనే విషయం రాజమౌళి చెప్పలేదు. కానీ వాళ్ళ ఎయిర్ పోర్ట్ విజువల్స్ తో ఆ న్యూస్ లు లీకయ్యాయి.
ఒడిశా లో షూటింగ్ కోసం టీమ్ మొత్తం వెళ్ళింది. ఎంత సీక్రెట్ లొకేషన్స్ చూజ్ చేసుకున్నా రాజమౌళికి ఈ లీకులు బెడద తప్పేలా లేదు. ఇది రాజమౌళికి పెద్ద తలనొప్పిగా మారేలా కనబడుతుంది. అదే విదేశాల్లో అయితే ఇలాంటి ప్రోబ్లెంస్ రాకపోవచ్చు. SSMB 29 సెకండ్ షెడ్యూల్ అయితే ఒడిశాలో స్టార్ట్ అయ్యింది. ఈ షెడ్యూల్ లో మహేష్-పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలు ఇంకా కీలక నటులు పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది.