గత ఏడాది అంటే 2024 ఎన్నికల్లో ఓడిపోయాక జగన్ ఏపీ ప్రజలకు, వైసీపీ కార్యకర్తలకు అదుబాటులో ఉండడం కన్నా ఎక్కువగా ఆయన తల్లి విజయమ్మ, చెలి షర్మిలపై ఆస్తి తగాదాలతోను, అలాగే బెంగుళూర్ ప్యాలెస్ లో సేద తీరుతూ కనిపిస్తున్నారు జగన్. ఏదైనా పని ఉంటే తాడేపల్లి వచ్చి వెళుతున్న జగన్ ఎక్కువ శాతం బెంగుళూరులోనే గడుపుతున్నారు.
ఇప్పుడు కూడా అసెంబ్లీ కి హాజరవకుండా జగన్ బయట మీడియా తో ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై నాలుగు మాటలు మాట్లాడేసి, కొద్దిగా విమర్శించేసి మళ్లీ వైసీపీ కార్యకర్తలను గాలి కొదిలేసి బెంగుళూరు పయనమయ్యారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చెయ్యడం లేదు అంటూ హడావిడి చేసేసిన జగన్ బెంగుళూరు కు వెళ్లిపోవడంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు నిరాశపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ జగన్ చేసిన కామెంట్స్ పై జనసైనికులే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక జగన్ తాడేపల్లి వచ్చి వెలగబెట్టింది ఏమి లేదు, రెండు ప్రెస్ మీట్స్, ఓ వైసీపీ పార్టీ సమావేశమంటూ హడావిడి చేసి బెంగుళూరుకి చెక్కేశారని అందరూ మాట్లాడుకుంటున్నారు.