Advertisementt

శ్రీరెడ్డిపై ఇంత సానుభూతి ఉంటుందా

Sat 01st Mar 2025 08:43 PM
sri reddy  శ్రీరెడ్డిపై ఇంత సానుభూతి ఉంటుందా
Will Jagan Support Sri Reddy Like He Did for Posani? శ్రీరెడ్డిపై ఇంత సానుభూతి ఉంటుందా
Advertisement
Ads by CJ

జగన్ మెప్పు కోసం చంద్రబాబు, పవన్, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరూ జైలు పాలయ్యేట్లుగా కనిపిస్తుంది వ్యవహారం. కూటమి ప్రభుత్వ కేసులకు భయపడి పోసాని లాంటి వాళ్ళు రాజకీయ సన్యాసం చేసినా, జగన్ ప్రభుత్వంలో నోటి దూల ఇప్పుడు వారిని కష్టాల పాలు చేసింది. సోషల్ మీడియాలో RGV, శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు ఉచ్ఛం నీచం మరిచి మరీ వెకిలి కామెంట్స్ చేసారు. 

కూటమి ప్రభుత్వం పెట్టే కేసులకు భయపడి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు RGV, శ్రీరెడ్డిలు. కానీ జగన్ కోసం ప్రాణం పెట్టి జగన్ ఇచ్చే పదవి కోసం కక్కుర్తి పడి పవన్ కళ్యాణ్, చంద్రబాబులను పర్సనల్ గా టార్గెట్ చేసి వైసీపీ ఓడిపోయిన మరుక్షణం సైలెంట్ అయిన పోసానిపై పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు కాగా, పోసాని భయపడి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి సారీ చెప్పాడు. 

అయినా పోసాని అరెస్ట్ తప్పలేదు, వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకున్న పోసాని అరెస్ట్ విషయంలో ఆయన భార్యను ఫోన్‌లో పరామర్శించారు జగన్ మోహన్ రెడ్డి. నేనున్నాను అని భరోసా ఇచ్చారు. అదే మాదిరి తన కోసం సోషల్ మీడియాలో పని చేసిన శ్రీరెడ్డి ఒకవేళ అరెస్ట్ అయ్యి జైలుకెళితే జగన్ ఇలానే సపోర్ట్ చేస్తారా? అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Will Jagan Support Sri Reddy Like He Did for Posani?:

Posani Arrest and Political Retreat: Will Sri Reddy Receive the Same Support?

Tags:   SRI REDDY
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ