Advertisementt

క్షమించమంటున్న విశ్వక్ సేన్

Thu 20th Feb 2025 04:51 PM
vishwak sen  క్షమించమంటున్న విశ్వక్ సేన్
Vishwak Sen apologizes క్షమించమంటున్న విశ్వక్ సేన్
Advertisement
Ads by CJ

లైలా చిత్రంతో విశ్వక్ సేన్ విపరీతమైన నెగిటివిటి మూటగట్టుకున్నాడు. లైలా చిత్రానికి ముందు కాంట్రవర్సీలతో సారీ చెప్పిన విశ్వక్ సేన్ సినిమా విడుదలయ్యాక మరింతగా సఫర్ అయ్యాడు. లైలా సినిమాకు దారుణమైన రివ్యూస్ రావడమే కాదు,  అందులో ఉన్న వల్గారిటీ అతన్ని మరిన్ని విమర్శలపాలు చేసింది. విశ్వక్ సేన్ కెరీర్ లోనే లైలా చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే లైలా చిత్రం పై వచ్చిన విమర్శలకు విశ్వక్ సేన్ సారీ చెబుతూ వదిలిన ప్రెస్ నోట్ హైలెట్ అయ్యింది. 

ఇటీవల నా సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయి. నా చివరి సినిమాకు వచ్చిన నిర్మాణాత్మక విమర్శను పూర్తిగా అంగీకరిస్తున్నాను. 

నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ - నా అభిమానులకు, నాపై ఆశీర్వాదంగా నిలిచినవారికి హృదయపూర్వక క్షమాపణలు. 

నా ప్రాధాన్యం ఎప్పుడూ కొత్తదనం తీసుకురావడమే, కానీ ఆ ప్రయత్నంలో మీ అభిప్రాయాలను నేను గౌరవిస్తున్నాను. ఇక పై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు. 

నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఎందుకంటే, నా ప్రయాణంలో ఎవ్వరూ లేని సమయంలో నన్ను ప్రేమతో ముందుకు నడిపించింది మీరు. నా కెరీర్ ప్రారంభం నుంచి నేను ఎంచుకున్న కథలను మీరు ఎంతగా ప్రేమించారో తెలుసు. 

ఇక పై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను. అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 

అలాగే, నా కథానాయకులు దర్శకులు, రచయితలు నా వెన్నెముకగా నిలిచి, నన్ను మలిచిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి నిర్మాణాత్మక విమర్శలకు ధన్యవాదాలు. త్వరలోనే మరొక బలమైన కథతో ముందుకు వస్తాను. నా మంచి, చెడు కాలాల్లో నన్ను నమ్మి నిలబెట్టుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నాకు ఎంతో ప్రాముఖ్యం. 

విశ్వక్ సేన్

Vishwak Sen apologizes :

Vishwak Sen apologizes for vulgarity in Laila

Tags:   VISHWAK SEN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ