వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత వైసీపీ నేతల్లో ముందుగా అరెస్ట్ అయ్యేది కొడాలి నాని నే అంటూ ప్రచారం జరగడమే కాదు టీడీపీ నేత బుద్ధా వెంకన్న అదే చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత ఓటమి బాధకన్నా కేసుల భయంతో రాజకీయాలకు దూరంగా ఉంటూ వైసీపీ లో యాక్టీవ్ గా లేని కొడాలి నాని కి చిప్పకూడు తినే పరిస్థితి ఎప్పడు వస్తుందా అని టీడీపీ నేతలు, అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఫ్రెండ్ వంశీ అరెస్ట్ తర్వాత కొడాలి నాని ప్రెస్ మీట్లు పెడతాడని వెయిట్ చేసారు, మరోపక్క కొడాలి ఫోన్ స్విచ్ఛాఫ్ అనే వార్తలు. ఈనేపథ్యంలో ఆయనని ఓ ఛానల్ యాంకర్ ఏంటి సర్ రెడ్ బుక్ లో మీ పేరే ముందుందట, మీ మీద మూడు కేసులు ఉన్నాయట అని అడగగానే దానికి కొడాలి నాని చిర్రుబుర్రులాడుతూ రెడ్ బుక్ లో నా పేరు ముందుంది అనేది నువ్వు చూసావా అంటూ యాంకర్ పై ఫైర్ అయ్యాడు.
అంతేకాదు మూడు కాకపోతే ముప్పై కేసులు పెట్టుకోమను, ఇంతమంది లాయర్లు ఎందుకున్నారు, రెడ్ బుక్ దానికి వాల్యూనే లేదు, కేసులు పెట్టి జైలుకి పంపిస్తే భయపడరు ఎవరూ అంటూ కొడాలి తన ఫ్రస్టేషన్ మొత్తం చూపించాడు.