ప్రభాస్ హనురాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఫౌజీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రకటన రాకముందే ఈ సినిమా గురించి ఆసక్తికరమైన సమాచారం లీక్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా కనిపించనున్నారు. కథలో నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌కు లింక్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో కథానాయికగా ఇమాన్వీ ఇప్పటికే ఎంపికైంది. అయితే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కోసం మరో హీరోయిన్ అవసరం ఉంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు సుమారు అరగంట పాటు కొనసాగనున్నాయి. కథకు ప్రధానమైన ఈ భాగంలో కనిపించే పాత్ర చాలా ప్రాధాన్యత కలిగినదిగా ఉంటుందని టాక్.
దీంతో ఈ కీలకమైన పాత్ర కోసం హనురాఘవపూడి ఓ స్టార్ హీరోయిన్‌ను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే కొన్ని పేర్లను పరిశీలించగా సాయి పల్లవి కూడా ఆ లిస్టులో ఉన్నట్లు సమాచారం. ఇటీవల హను రాఘవపూడి, సాయి పల్లవితో భేటీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్ర కథ సాయి పల్లవికి నచ్చినప్పటికీ ఇంకా ఆమె నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం సాయి పల్లవి తన తండేల్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ సినిమా విడుదలైన తర్వాత ఆమె తదుపరి ప్రాజెక్ట్‌పై నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ఒకవేళ సాయి పల్లవి ఈ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పినట్లయితే ఫౌజీ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.