అనసూయ భరద్వాజ్ ఈమధ్యన యూట్యూబర్ నిఖిల్ విజయేంద్రకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా నిలిచాయి. ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ దగ్గర నుంచి సినిమాల విషయం వరకు ఎన్నో విషయాలను మాట్లాడింది. ఇక సినిమా ప్రపంచంలో నో చెప్పడం వలన తాను చాలా కోల్పోయాను అంటూ హాట్ కామెంట్స్ చేసింది.
తనని ఓ దర్శకుడు, ఓ హీరో కమిట్మెంట్ అడుగగా దానికి నో చెప్పాను, 9th క్లాస్ లోనే నాకు ప్రపోజ్ చేస్తే వారికీ నో చెప్పాను, సినిమా ఇండస్ట్రీ అయినా అంతే అంటూ అనసూయ చాలా కాజువల్ గా చెప్పుకొచ్చింది. నో చెప్పడం వలన తాను చాలా కోల్పోయాను అంది. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆమె మాట్లాడుతూ.. పవన్ గారితో గతంలోనే ఒక సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ సమయంలో అలాంటి సాంగ్స్ చేయకూడదు అనుకున్నాను.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఛాన్స్ వస్తే ఓకే చెప్పాను. వీరమల్లులో చాలా మంచి సాంగ్ అది. క్యాచీగా ఉంటుంది. మాసివ్ గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా రెస్పాన్సిబుల్ పొలిటీషియన్. పొలిటికల్ తో చాలా హెవీ వర్క్ తో ఓ పక్క సినిమా, మరో పక్క పాలిటిక్స్ మేనేజ్ చేసేవారు. ఆయన్ని చూస్తే ఇన్‌స్పైర్ గా అనిపిస్తుంది.
ఇక మెగా ఫ్యామిలిలో చాలామంది హీరోలతో పని చేశాను. అందుకే నన్ను మెగా కాంపౌండ్ నటి అంటుంటారు. నాగబాబు గారితో జబర్దస్త్ చేశాను, చిరంజీవి గారితో నటించాను, చరణ్ తో యాక్ట్ చేశాను, మెగా హీరోలు చాలామంచి వారు. హుందాగా ఉంటారు అంటూ అనసూయ మెగా హీరోలపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.