ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Khushi Kapoor Open Comments on Plastic Surgery

ప్లాస్టిక్ సర్జరీపై ఖుషి కపూర్ ఓపెన్ కామెంట్స్

చాలామంది హీరోయిన్స్ తమ శరీరంలోని చాలా భాగాలను అందంగా చూపించుకోవడానికే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. అల్లు అర్జున్, సమంత ఇలా చాలామంది తారలు ప్లాస్టిక్ సర్జరీతో అందంగా మారినవారే అంటూ ఉంటారు. కానీ వారెప్పుడు ఈ విషయమై ఓపెన్ అవ్వరు. గతంలో శ్రీదేవి కూడా ప్లాస్టిక్ సర్జరీలు చాలా చేయించుకుంది అనే ప్రచారం ఉంది. 

తాజాగా శ్రీదేవి కుమార్తె ఖుషి కపూర్ ప్లాస్టిక్ సర్జరీలపై చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఖుషి కపూర్ పై కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది అనే ప్రచారం ఉంది. తాజాగా లవ్‌యాపా ప్రమోషన్స్ లో ఖుషి మాట్లాడుతూ.. ప్లాస్టిక్ సర్జరీ అయినా, ఫేస్ సర్జరీ చేయించుకోవడం పెద్ద విషయం అని నేను అనుకోను. వారు నన్ను ప్లాస్టిక్ అనడం నేను వింటూనే ఉంటాను. ఒకరిని ప్లాస్టిక్ అని పిలవడం అతిపెద్ద అవమానం అని జనాలు అనుకుంటారు. 

నేను హీరోయిన్ గా అడుగుపెట్టకముందే నేనెలా ఉంటాను అనే విషయాలను ముందే ఊహించేసుకున్నారు ప్రేక్షకులు. అందులో చాలావరకు నెగిటివ్‌గానే ఉన్నాయి, నేను ప్లాస్టిక్ సర్జరీపై ఓపెన్ గా మాట్లాడడానికి అస్సలు సిగ్గుపడను అంటూ చెప్పుకొచ్చింది ఖుషి కపూర్

Khushi Kapoor says plastic is not insult

Khushi Kapoor Open Comments on Plastic Surgery
khushi kapoor