హైదరాబాద్ లో ఎయిర్ పోర్ట్ లో యంగ్ టైగర్

చాలారోజుల తర్వాత గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ఈరోజు సోమవారం హైదరాబాద్ బేగం పేట ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. డిసెంబర్ చివరి వారంలో ఆయన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళ్లిన తర్వాత లండన్, స్కాట్లాండ్స్ లో అభిమానుల కెమెరాల్లో బంది అయ్యారు కానీ.. అఫీషియల్ గా ఎన్టీఆర్ నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు.
తాజాగా ఆయన బేగం పేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై వెళుతూ స్టలిష్ లుక్ లో కనిపించారు. వార్ 2 బ్యాలెన్స్ షూట్ కోసం ఎన్టీఆర్ ముంబై వెళుతున్నట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి తిరిగిరాగానే ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ మొదలు కాబోతుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ మొదలు పెట్టారు
ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూట్ కి వెళుతుంది అన్నా దానిపై అప్ డేట్ లేదు. ఎన్టీఆర్-నీల్ మూవీ కర్ణాటక నుంచి మొదలు కాబోతున్నట్టుగా టాక్ ఉంది.
Young tiger NTR Papped at Hyderabad airport
NTR Papped at Hyderabad airport





































