ఆ పదవి నుంచి తప్పుకొనున్న నారా లోకేష్

కూటమి ప్రభుత్వంలో, ఆయా పార్టీల్లో ఇప్పుడు పదవులు పందేరాలు నడుస్తున్నాయి. ఎప్పుడు ఎవరి నోట ఎలాంటి డిమాండ్ వస్తుందో.. ఎవరు ఎక్కడికి ప్రమోట్ అవుతారో.. ఎక్కడిని ఎక్కడికి డిమోషన్ వస్తుందో తెలియని పరిస్థితి. నిన్న మొన్నటి వరకూ లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని తమ్ముళ్లు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలని జనసైనికులు హడావుడి అంతా ఇంతా కాదు. అటు.. ఇటు రెండు పార్టీల అధిష్టానాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో కాస్త సద్దుమణిగింది. ఐతే ఈ క్రమంలోనే మంత్రి నారా లోకేష్ సంచలన ప్రకటన చేశారు.
అవును.. నా వ్యక్తిగతం
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శిగా నారా లోకేష్ సుమారు 15 ఏళ్లుగా ఉంటున్నారు. ఐతే ఈ పదవి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు మరికరికి అప్పగించాలని ఆలోచనలో ఉన్నట్లు వెళ్ళడించారు. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ములకు మించి ఉండకూడదనేది తన అభిప్రాయం అని తెలిపారు. ఐతే ఈ మాటలు తన వ్యక్తిగతం మాత్రమే అని కూడా స్పష్టం చేశారు. పనిలో పనిగా డిప్యూటీ సీఎం పదవిపై కూడా పెదవి విప్పారు. తాను సాధారణ కార్యకర్తగానే పనిచేస్తానని, అదే ఇష్టమని లోకేష్ ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు.
మార్పులు.. చేర్పులు!
వాస్తవానికి గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకూ ఆఖరికి పొలిట్ బ్యూరోలో మార్పులు చేర్పులు చేయాలని అధిష్టానం భావిస్తోంది. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందని తెలుగు తమ్ముళ్లు ఇది వరకే చెప్పిన మాటలు. ఐతే ఇప్పుడు లోకేష్ నోట అదే మాట రావడంతో మార్పులు పక్కా అని తెలిసిపోయింది. దీనికితోడు టీడీపీ చరిత్రలో లేని జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి చినబాబు (లోకేష్)ను వరించనున్నట్టు తెలిసింది. దీంతో పాటు ఇక పార్టీకి యువ రక్తం ఎక్కించడానికి చంద్రబాబు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే మంత్రివర్గంలో మొత్తం యువ మంత్రులే ఉండగా.. ఇక టార్గెట్ 2029గా లోకేష్ కోసం బాబు టీంను తయారు చేస్తున్నట్టు చెప్పుకోవచ్చు.
Lokesh clarified on deputy chief minister post to resign national secretary soon
Nara Lokesh will resign from that post





































